ఇది జరిగింది... తమిళనాడులోని చెన్నైలో అని మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. అక్కడి అరుంబాక్కమ్లో ఓ మహిళ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. నాలుగేళ్ల కిందట... భర్తతో గొడవ జరగడంతో... అప్పటి నుంచి ఆయనకు దూరంగా ఉంటోంది. ఈమధ్య ఎవరో గానీ ఆమె వాట్సాప్ నంబర్ తెలుసుకున్నారు. ఆ నెంబర్‌కి అదే పనిగా కాల్స్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. హలో అనగానే... డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతు పురాణం. ఇలాగైతే... ఇంట్లో అమ్మానాన్నలు తప్పుగా అర్థం చేసుకుంటే ఇబ్బంది కదా... ఆమె చాలా మానసికంగా ఫీలైంది. కొన్ని రోజులకు ఆమె వాట్సాప్‌కి బూతు వీడియోలు పంపడం ప్రారంభించారు. తర్వాతా కాల్స్ చేసి... నువ్వంటే ఇష్టం... నిన్ను ఒంటరిగా కలిసి... అంటూ అడ్డమైన బూతు పురాణం మొదలుపెట్టారు.
ఆగస్ట్ 4న బాధితురాలికి తొలి మొబైల్ కాల్ వచ్చింది. ఆమె కొత్త నంబరైనా రిసీవ్ చేసుకొని హలో అంది. అంతే అప్పటి నుంచి ఆమెకు వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆగస్ట్ 8న నిందితుడు ఆమెకు వాట్సాప్‌లో పోర్న్ వీడియోలు పంపాడు. ఈ బాధ భరించలేక... తన సమస్యను పేరెంట్స్‌కి చెప్పింది. ఇలాంటివి టీవీల్లో చూస్తూ... పేపర్లలో చదువుతూ ఉన్న తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు. మేం చెప్పినట్లు చెయ్యి అని ఓ ప్లాన్ చెప్పారు. అదే హనీ ట్రాప్.
ఆమె అతని వాట్సాప్ నంబర్‌కి ఓ మెసేజ్ పంపింది. నీకు నచ్చానా... నాతో మాట్లాడాలని ఉందా... సరే... ఒంటరిగా మా ఇంటికి రా. నువ్వు వచ్చే టప్పుడు మా ఇంట్లో వాళ్లను లేకుండా చేస్తాను. అని మెసేజ్ పెట్టింది. నిందితుడు ట్రాప్‌లో పడ్డాడు. ఓ రోజు వస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. అతను వచ్చిన సమయంలో... కుటుంబ సభ్యులు... ఓ గదిలో దాక్కున్నారు.
29 ఏళ్ల నిందితుడు విమల్‌రాజ్... ఆమె ఇంటికి వచ్చాడు. అతన్ని లోపలికి రమ్మంది. అంతే... తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని... పిడిగుద్దులు గుద్ది... తాళ్లతో కట్టేశారు. నెక్ట్స్ పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేశారు. పోలీసులు వచ్చి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
ఇంటరాగేషన్‌లో అసలు విషయం తెలిసింది. విమల్‌రాజ్... తిరుత్తణిలో ఉంటున్నాడు. ఇతను ఓ ఈ-కామర్స్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అలా చేస్తూ... మొబైల్ నంబర్లు సేకరిస్తున్నాడు. వాటిలో ఏదో ఒక నంబర్‌కి కాల్ చేస్తున్నాడు. కాల్ రిసీవ్ చేసుకున్నది మహిళలైతే చాలు... వాళ్లను బూతు పురాణంతో టార్చర్ చేస్తున్నాడు. అలా అతని ఉచ్చులో బాధితురాలు చిక్కుకుంది. ఐతే... భర్తే ఇలా చేయిస్తున్నాడేమోనని బాధితురాలి పేరెంట్స్‌కి అనుమానం ఉంది. అందువల్ల పోలీసులు... ఆమె భర్తను కూడా ప్రశ్నిస్తామని తెలిపారు. చూశారా... ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి.
మనం ఎవరికి బడితే వారికి మొబైల్ నంబర్ ఇచ్చేయకుండా జాగ్రత్త పడాలి. బట్... ఈ-కామర్స్ సైట్లకు నంబర్లు ఇవ్వకుండా ఉండలేం. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలాంటి పనులు చేయకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.