డంపింగ్ యార్డులో మహిళ శరీర భాగాలు... హంతకుల కోసం చెన్నైలో పోలీసుల వేట

నమూనా చిత్రం

Chennai : కొడంబాకం, నంగంబాకం, టి.నగర్‌ ఏరియాల్లో రెండు ప్రత్యేక బృందాలు హంతకుల కోసం గాలిస్తున్నాయి.

  • Share this:
తమిళనాడులోని పల్లికరనాయ్ పోలీసులకు ఉదయాన్నే కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లారు. అక్కడి డంపింగ్ యార్డులో... మహిళ శరీర భాగాలు విడివిడిగా కనిపించాయి. ఆమె వయస్సు 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. ఆమె ఎవరు? చంపిందెవరు? ఎందుకు? శరీర భాగాల్ని ముక్కలు చేసేంత క్రూరంగా చంపడానికి కారణమేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. రెండు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. సమాధానాల కోసం... కొడంబాకం, నంగంబాకం, టి.నగర్‌ ఏరియాల్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాయి. ఈ ఏరియాల నుంచీ రోజూ పెద్ద సంఖ్యలో చెత్త వల్లువార్ కొట్టం డంపింగ్ యార్డుకి వస్తుంది. అక్కడి నుంచీ పల్లికరనాయ్ డంపింగ్ యార్డుకు చేరుతుంది.

చెత్తను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించారు. వాళ్లు చెప్పిన దాని ప్రకారం... రోజూ వెళ్లే 30 ట్రక్కుల్లో ఒక్కటి మాత్రమే ఆ రోజు పల్లికరనాయ్ డంపింగ్ యార్డుకి వెళ్లింది. అందులోనే మహిళ మృతదేహాలు తరలివెళ్లినట్లు అంచనా.

పోలీసులు తమిళనాడులోని అన్ని పోలీస్ స్టేషన్లనూ అలర్ట్ చేశారు. ఎవరైనా మహిళలు మిస్సింగ్ అయినట్లు కంప్లైంట్లు వచ్చాయేమో ఆరా తీశారు. మహిళ కుడి భుజం వెనకవైపు ఉన్న టాటూని ఫొటో తీసి... పీఎస్‌లకు పంపారు. విడిభాగాల్ని క్రోమెపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

 

Video : చక్కగా నిద్రపోవడానికి చక్కటి చిట్కాలు
First published: