ఇద్దరు భార్యలు, రైళ్లల్లో చోరీలు... ఆ డబ్బుతో మలేషియాలో స్టార్ హోటల్ కట్టేసిన ఘరానా దొంగ...

ఏసీ బోగీల్లో సీటు రిజర్వేషన్ చేయించుకుని... అర్ధరాత్రి దాటక చోరీ సొత్తుతో పరార్... కొట్టేసిన నగలను దుకాణాల్లో విక్రయిస్తూ మలేషియాలో హోటల్ బిజినెస్... నిందితుడిపై రేప్, ఛీటింగ్ కేసులు కూడా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 19, 2019, 8:45 AM IST
ఇద్దరు భార్యలు, రైళ్లల్లో చోరీలు... ఆ డబ్బుతో మలేషియాలో స్టార్ హోటల్ కట్టేసిన ఘరానా దొంగ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇద్దరు భార్యలు, మలేషియాలో స్టార్ హోటల్ బిజినెస్... అతను ఏ వ్యాపారమో, లేక స్టాక్ మార్కెట్‌లో షేర్ కొంటూ బిజీగా ఉండే వర్తకుడో అనుకుంటే పొరపాటే. అతను చేసేది ఘరానా చోరీలు. అవును... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రైళ్లల్లో చోరీలు చేస్తూ, ఆ డబ్బుతో మలేషియాలో స్టార్ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ బడా ఖిలేడీ దొంగను చెన్నై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యంగా చెన్నై నుంచి సేలం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో అర్ధరాత్రి సమయాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతుండడంత రైలు దొంగలను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపారు. పక్కా స్కెచ్ ప్రకారం దంపతుల్లా నటిస్తూ రైళ్లల్లో ప్రయాణించారు. ఇలా చెన్నై నుంచి వెళ్తున్న ఓ రైలులో ప్రయాణికుడి నుంచి బ్యాగు తీసుకుని, పారిపోవడానకి ప్రయత్నించిన ఓ దొంగను అరెస్ట్ చేశారు. విచారణలో ఆ ఘరానా దొంగ గురించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కేరళ రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల సాహుల్ అమీద్... కుటుంబంతో సహా మలేషియాలో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఇద్దరు భార్యాలతో కలిసి ఓ స్టార్ హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే హోటల్ పెట్డడానికి, నిర్వహణకి అయ్యే ఖర్చంతా చోరీల ద్వారానే సంపాదించాడు.

చోరీ చేయడానికి ముందుగా ఏసీ బోగీల్లో సీటు రిజర్వేషన్ చేయించుకుంటాడు. రైలు ఎక్కే ప్రయాణికుల కదలికలను గమనిస్తూ ఉంటాడు. ఎవ్వరి దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయో గ్రహిస్తాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత వారి లగేజీతో ట్రైన్ దిగి ఉడాయిస్తాడు. ఇలా 2016 నుంచి వరుస చోరీలకు పాల్పడుతున్ాడు సాహుల్ అమీద్. కొట్టేసిన నగలను తిరుచ్చూర్, ముంబయి సిటీల్లోని నగల దుకాణాల్లో విక్రయిస్తాడు. వచ్చిన నగదుతో మలేషియాలో హోటెల్ నిర్వహిస్తున్నాడు. చోరీలు మాత్రమే కాకుండా నాగపూర్‌లో కొందరు మహిళలపై అత్యాచారం చేసినట్టు, ఛీటింగ్ కేసులు కూడా సాహిల్‌పై నమోదు కావడం విశేషం. అతని నుంచి 110 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading