
మిడ్ నైట్ బిర్యానీలు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్‌లు, స్నాక్స్ వంటివి తినాలనే కోరికలను పక్కన పెట్టాలి. త్వరగా తినేయడం వల్ల అర్ధరాత్రి సమయంలో ఆకలేస్తుందనిపిస్తే నట్స్, పాలు లాంటివి తీసుకోవచ్చు.
ఆ నోటిఫికేషన్ని చూసిన వెంటనే ప్రియ.. బిర్యానీ ఆర్డర్ చేసింది. ఎంతసేపు వేచి ఉన్నా బిర్యానీ మాత్రం రాలేదు
76 రూపాయల బిర్యానీ కోసం... 49వేలు పోవడం ఏంటి అనుకుంటున్నారా ? మీరు చదివింది అక్షరాల నిజం.
చెన్నైలోని షావుకారుపేటలో ఉండే కాలేజ్ స్టూడెంట్ ప్రియ సెల్‌ఫోన్ చూస్తుండగా ఓ ఫుడ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం రూ.76కే బిర్యానీ అందిస్తామంది. ఆ నోటిఫికేషన్ని చూసిన వెంటనే ప్రియ.. బిర్యానీ ఆర్డర్ చేసింది. ఎంతసేపు వేచి ఉన్నా బిర్యానీ మాత్రం రాలేదు. దీంతో యాప్ వాళ్లకు ఫోన్‌చేసి.. తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరింది. అయితే రూ.76 తక్కువ మొత్తం కనుక ఆన్లైన్లో వెనక్కి ఇవ్వలేమని వాళ్లు చెప్పారు.
అయితే రూ.5 వేలు నగదు జమచేస్తే.. తిరిగి రూ.5,076 ఒకేసారి పంపిస్తామన్నారు. యాప్ వాళ్లు చెప్పినది గుడ్డిగా నమ్మిన ప్రియ రూ.5 వేలు పంపింది. అయినా వాళ్లు డబ్బులు పంపించలేదు. మరింత నగదు జమచేయాలని కోరారు. అలా ఆమె నుంచి ఐదువేలు కాదు... ఏకంగా రూ.40 వేలు దోచుకున్నారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Published by:Sulthana Begum Shaik
First published:July 07, 2019, 09:07 IST