Home /News /crime /

CHENNAI SELF STYLED GODMAN ARRESTED FOR RAPING WOMAN FOR YEARS WITH WIFE HELP IN TAMIL NADU MKS

Pushpa.. ఇంత దారుణమా? -భార్యాభర్తలు చెరోవైపు చేరి బాలికను నగ్నంగా పడుకోబెట్టి.. ఏళ్లపాటు..

నిందితుడు సత్యనారాయణన్

నిందితుడు సత్యనారాయణన్

పుష్పలత ఇచ్చిన జ్యూస్ కారణంగా మత్తులోకి జారుకున్న బాలిక.. తిరిగి కళ్లు తెరిచేసరికి ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా బెడ్ పై పడికొని ఉండటాన్ని గుర్తించింది. తనకు ఓవైపు సత్యనారాయణన్, మరోవైపు పుష్పలత కూర్చొని ఉండటాన్ని గమనించి భయంతో ముడుచుకుపోయింది. పుష్పలత ఆ బాలికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నట్లు నటిస్తూ ఏమీ కాలేదు, కంగారు పడొద్దని సముదాయించింది..

ఇంకా చదవండి ...
నెత్తురు చిందకున్నా నేర చరిత్రలోనే అత్యంత జుగుప్సాకరమైన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను తాను భగవంతుడి అవతారంగా చెప్పుకునే ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్య సహాయంతో భక్తురాలైన బాలికపై అత్యాచారం చేశాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. పాపాలను పోగొట్టేందుకే నీతో పడుకుంటున్నానంటూ నమ్మించాడు. బాలిక పెద్దయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెను వదల్లేదు. నగ్న ఫొటోలను అడ్డం పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఏళ్లపాటు బాధితురాలిపై వికృతకాండను కొనసాగించారు. చివరికి భర్త సహాయంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దేవుణ్ణని చెప్పుకునే వ్యక్తిని, అతని భార్యను అరెస్టు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో శనివారం వెలుగులోకి వచ్చిందీ దారుణ ఉదంతం. చెన్నై మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాలివి.

దొంగ స్వామీజీ దంపతుల అరెస్ట్
చెన్నై నగరానికి చెందిన సత్యనారాయణన్ అనే వ్యక్తి తనను తాను భగవంతుడి అవతారంగా ప్రచారం చేసుకుంటాడు. భార్య పుష్పలతతో కలిసి నగరంలోనే ‘శిర్డీపురం సర్వ శక్తి పీఠం సాయి బాబా కోయిల్’పేరుతో సొంతగా ఆలయంలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని నీతి బోధలు, సూక్తులకు ఆకర్షితులైన జనం మెల్లగా అతణ్ని భగవంతుడనే నమ్మడం మొదలుపెట్టారు. అలా సత్యనారాయణన్ కు భక్తులుగా చాలా కుటుంబాలు తయారయ్యాయి. వాటిలో ఓ కుటుంబానికి చెందిన యువతి.. దొంగ బాబాపై, అతని భార్యపై ఫిర్యాదు చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు.. సత్యనారాయణన్, ఆయన భార్య పుష్పలతను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. నిందితుడు సత్యనారాయణన్ కు ‘శిర్డిపురం నానా బాబా’పేరుతో యూట్యూబ్ చానెల్ ఉన్నట్లూ పోలీసులు గుర్తించారు. బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పోలీసులు శనివారం నాడు మీడియాకు వెల్లడించారు..

David Fuller : చనిపోయిన మహిళల్ని జుగుప్సాకరంగా రేప్ చేసి.. ఈ మానవ మృగం బారిన 102 మృతదేహాలు..


విభూది కోసం వెళ్లగా..
బాధితురాలు 16 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ తాను ఎదుర్కొంటున్న దారుణాన్ని ఫిర్యాదులో ఎకరువుపెట్టింది. చదవుకు కోసం చెన్నై వచ్చి తాతయ్య వాళ్ల ఇంట్లో ఉండేదా బాలిక. వారి కుటుంబం సత్యనారాయణన్ కు భక్తులు. ఆమె 12వ తరగతిలో ఉండగా ఒకరోజు ఇంట్లో పవిత్ర విభూది అయిపోవడంతో, ఆశ్రమానికి(బాబా ఉండే చోటికి) వెళ్లి కొత్త ప్యాకెట్ తీసుకురావాల్సిందిగా తాతయ్యవాళ్లు కోరారు. ఆ మేరకు వెళ్లిన బాలిక.. విభూది కోసం వచ్చానని స్వామీజీకి చెప్పగా, స్వామీజీ భార్య అప్పటికప్పుడే జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. కాదనలేక జ్యూస్ తాగేసిన అమ్మాయి కళ్లు తిరిగి అక్కడే పడిపోయింది. మెలకువ వచ్చేసరికి...

అతడి కోసం జైలుకు 12 మంది అందగత్తెలు.. పోలీసులకు నెలకు రూ.1కోటి లంచం.. ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు


భార్యాభర్తల మధ్యలో నగ్నంగా..
పుష్పలత ఇచ్చిన జ్యూస్ కారణంగా మత్తులోకి జారుకున్న బాలిక.. తిరిగి కళ్లు తెరిచేసరికి ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా బెడ్ పై పడికొని ఉండటాన్ని గుర్తించింది. తనకు ఓవైపు సత్యనారాయణన్, మరోవైపు పుష్పలత కూర్చొని ఉండటాన్ని గమనించి భయంతో ముడుచుకుపోయింది. పుష్పలత ఆ బాలికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నట్లు నటిస్తూ ఏమీ కాలేదు, కంగారు పడొద్దని సముదాయించింది. ‘నీ ఒంటి నిండా పాపాలు పేరుకుపోయాయి. వాటిని శుద్ది చేశాం. ఇకపై నువ్వు పవిత్రురాలివి..’అంటూ సత్యనారాయణన్ బాలికకు ఉపదేశం చేశాడు. తనకేం జరిగిందో తెలియని స్థితిలోనే ఆ బాలిక ఆశ్రమం నుంచి వెళ్లిపోతుండగా.. ఇక్కడ జరిగిన తంతు ఎవరికీ చెప్పొద్దని, ఒకవేళ నోరు విప్పితే ఫొటోలు, వీడియోలు బయటికొస్తాయని బాలికను పుష్పలత బెదిరించింది. తర్వాత..

kenya giraffes: భగవంతుడా.. బతుకెందుకిచ్చావ్? త్వరలో మనుషులకూ ఇలాంటి దుస్థితేనా!!


పెళ్లయిన తర్వాతా వదల్లేదు..
తనకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలోతానే కుమిలిపోయిన బాలిక మరో రెండేళ్లపాటు ఆశ్రమం వైపు పోలేదు. ఈలోపే ఆమెకు గల్ఫ్ దేశాల్లో పనిచేసే ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పనికోసం విదేశాలకు వెళ్లిపోయాడు. రెండేళ్ల కిందటి రేప్ ఘటన తర్వాత తమకు దూరంగా ఉంటోన్నా యువతి కదలికలను, ఆమె జీవితంలో జరుగుతోన్న ప్రతి ఘటననూ సత్యనారాయణన్, పుష్పలత నిశితంగా గమనిస్తూ వచ్చారు. భర్త విదేశాలకు వెళ్లగా అదే సరైన సమయమని భావించి మళ్లీ ఆశ్రమానికి రావాల్సిందిగా యువతికి మెసేజ్ పంపారు. తాను రాబోనని ఆమె తెగేసి చెప్పగా, నగ్న ఫొటోలు, వీడియోలను గల్ఫ్ లో ఉన్న భర్తకు పంపుతామని సత్యనారాయణన్ దంపతులు భయపెట్టారు. చేసేదేమీలేదక..

ఖగోళ చరిత్రలో అద్బుతం: తొలిసారి సూర్యుడిని తాకిన NASA స్పేస్‌క్రాఫ్ట్.. Parker తీసిన ఫొటో చూశారా?


బిడ్డ పుట్టాక ఆమెలో తెగింపు..
నాడు బాలికగా, తర్వాతి కాలంలో వివాహితగా ఆశ్రమానికి వెళ్లిన యువతిపై సత్యనారాయణన్ పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతి సందర్బంలోనూ అతనికి భార్య పుష్పవతి సహాయం చేసేది. ఈ క్రమంలోనే 2020 జనవరిలో బాధిత యువతి గర్భవతి అయింది. అబార్షన్ చేయించడానికి స్వామీజీ, ఆయన భార్య ప్రయత్నించినా యువతి ఒప్పుకోలేదు. తనను విడిచిపెట్టాల్సిందిగా ప్రాధేయపడింది. ఆ వేడుకుకోళ్లతోనే కాలం గిర్రున తిరిగి 2021 జనవరిలో బాధిత యువతి ఓ బాలుడికి జన్మనిచ్చింది. గర్భం, ప్రసవం సమయంలో కాస్త గ్యాప్ ఇచ్చిన సత్యనారాయణన్ దంపతులు మళ్లీ మొన్న నవంబర్ నుంచి యువతిని వేధించడం మొదలుపెట్టారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బాధను భరించలేని బాధిత యువతి అతి కష్టం మీద తనకు జరిగిన ఘోరాన్ని భర్తతో చెప్పుకుంది. అతను గల్ఫ్ నుంచే మాట్లాడి చెన్నైలో ఉన్న తన స్నేహితులను భార్యకు సహాయంగా పంపాడు. చివరికి బాధిత యువతి శుక్రవారం నాడు చెన్నై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. సత్యనారాయణన్ దంపతులను అరెస్టు చేసి వారిపై అత్యాచారం, కుట్రపూరిత నేరం తదితర సెక్షన్ల కింద కేసు నమొదు చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Chennai, Minor girl raped, Rape case, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు