Home /News /crime /

CHENNAI SCHOOL STUDENTS ACCUSE TEACHER OF MAKING SEXUAL HARASSMENT AND CAME TO ONLINE CLASS IN TOWEL SU

ఆన్‌లైన్ క్లాసులకు టవల్‌తో టీచర్.. విద్యార్థినిలకు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో స్టూడెంట్స్ పోస్ట్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ స్కూల్ టీచర్ విద్యార్థినిలతో అనుచితంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేసినట్టు స్టూడెంట్స్ ఆరోపించారు. ఆన్‌లైన్ క్లాసులకు టవల్‌తో హాజరైనట్టుగా చెప్పారు.

    ఓ స్కూల్ టీచర్ ఆన్‌లైన్ క్లాసులకు టవల్‌తో హాజరైనట్టుగా విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాండంటూ ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్‌ కేకే నగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న రాజగోపాలన్ అనే ఉపాధ్యాయుడు.. అకౌంటన్సీ అండ్ బిజినెస్ స్టడీస్ క్లాసులు టీచ్ చేస్తున్నాడు. అయితే రాజగోపాలన్ టీచ్‌ చేసే సమయంలో తప్పుడు దృష్టితో చూస్తున్నాడని ఆ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    PSBB స్కూల్ పూర్వ విద్యార్థులు సీరియస్‌గా తీసుకున్నారు. రాజగోపాలన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డీన్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా ఈ విషయంపై విచారణ జరపాలని కోరారు. స్కూల్‌లో క్లాసులు జరిగే సమయంలో.. రాజగోపాలన్‌ అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించేవాడని పూర్వవిద్యార్థులు వారి లేఖలో పేర్కొన్నారు. అమ్మాయిలను అనుచితంగా తాకడంతో పాటు.. లైంగిక పరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురిచేశావాడని ఆరోపించారు. అలాగే క్లాస్‌లో అందరి ముందు విద్యార్థినిలపై లైంగికపరమైన కామెంట్స్ చేసేవాడని అన్నారు. శరీరాకృతి గురించి మాట్లాడేవాడని చెప్పారు. స్లీవ్ లెస్ దస్తులు ధరించిన విద్యార్థినులను పొగిడేవాడని తెలిపారు.

    లాక్‌డౌన్ సమయంలో జరిగిన ఆన్‌లైన్ క్లాసులకు రాజగోపాలన్ ఒక టవల్ మాత్రమే ధరించి హాజరైనట్టు పూర్వ విద్యార్థులు ఆరోపించారు. అలాగే విద్యార్థినిలకు మెసేజ్‌లు చేయడంతోపాటు.. వారి వాట్సప్ ప్రొఫైల్ ఫొటోలపై కామెంట్స్ చేసేవాడని అన్నారు. కొందరికి ఫొటోలు అందంగా ఉన్నాయంటూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ పంపాడని చెప్పారు. ఓ విద్యార్థిని తనతో పాటు సినిమాకు రావాల్సిందిగా కోరాడని తెలిపారు.





    ఇక, రాజగోపాలన్ గురించి మేనేజ్‌మెంట్‌కు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు ఈ అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘చెన్నైలోని పీఎస్‌బీబీ స్కూల్‌లో ఓ టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరపాలని, ఇందులో ప్రమేయం ఉన్న పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని నేను హామీ ఇస్తున్నాను’అని కనిమొళి తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Sexual harrassment, Tamil nadu, Teacher misbehave

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు