Home /News /crime /

ప్లేబ్యాక్ సింగర్ కుమార్తెపై లైంగిక వేధింపులు.. చెల్లి ఇంట్లో ఉంచితే నీచానికి పాల్పడిన బంధువులు..చర్చి ఫాదర్ కూడా..

ప్లేబ్యాక్ సింగర్ కుమార్తెపై లైంగిక వేధింపులు.. చెల్లి ఇంట్లో ఉంచితే నీచానికి పాల్పడిన బంధువులు..చర్చి ఫాదర్ కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లో ఉండే ఓ ప్లే బ్యాక్ సింగర్ సినిమా అవకాశాల వల్ల తన కూతురిని పర్యవేక్షించడం కుదరదని తమిళనాడులోని చెన్నైలో ఉండే తన సొంత చెల్లి ఇంట్లో ఉంచితే ఘోరం జరిగింది. బంధువులే నీచానికి పాల్పడ్డారు..

  స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లోనే కాదు చివరకు సొంత వాళ్ల దగ్గర కూడా రక్షణ లేకుండా పోతోంది. కామాంధులు ఏ రూపంలో వస్తారో కూడా అంతుబట్టకుండా ఉంది. కన్న తండ్రులే కూతుళ్లను చెరపడుతున్నారు. అన్న, తమ్ముడి వరసున్న వాళ్లు కూడా కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో ఒకరు చర్చి ఫాదర్ కాగా, మరో ముగ్గురు ఆ బాలిక బంధువులే కావడం గమనార్హం. మగాళ్ల అరాచకాలను అడ్డుకుని ఆ బాలికకు అండగా ఉండాల్సిన సొంత పిన్ని కూడా ఈ ఘాతుకంలో పాలుపంచుకున్నదని తెలిసి పోలీసులే షాకయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లో ఉండే ఓ ప్లే బ్యాక్ సింగర్ సినిమా అవకాశాల వల్ల తన కూతురిని పర్యవేక్షించడం కుదరదని తమిళనాడులోని చెన్నైలో ఉండే తన సొంత చెల్లి ఇంట్లో ఉంచింది. ఆరేళ్ల వయసు నుంచి ఆ బాలిక తన పిన్ని వాళ్లింట్లోనే ఉండేది. వీలయినప్పుడల్లా తల్లి వచ్చి చూసి, కుమార్తెతో గడిపి వెళ్లేది. అయితే అండగా ఉండాల్సిన పిన్ని, బాబాయి వల్లే ఆ బాలిక చిక్కుల్లో పడింది. బాబాయి ఆమెపై ఎనిమిదేళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో తడిమేవాడు. వయసు పెరుగుతున్న సమయంలో అతడి ఉద్దేశాలను ఆ బాలిక గమనించి పిన్నికి చెప్పింది. అయినా పిన్ని తనకు సహకరించకపోగా భర్తను మరింతగా ప్రోత్సహించింది.

  బాబాయే కాకుండా, అతడి సోదరుడు కూడా ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ బాలికను చర్చికి తీసుకెళ్లగా చర్చి ఫాదర్ కూడా ఇదే నిర్వాకానికి పాల్పడేవాడు. ఈ నలుగురి చేష్టల వల్ల ఆ బాలిక తీవ్రంగా క్షోభకు గురయింది. ఇటీవల తన బాధను తల్లికి చెప్పింది. దీంతో ఆ తల్లి తమిళనాడు వచ్చి తన కూతురిని వేధిస్తున్న చెల్లి, ఆమె భర్త, అతడి సోదరుడి, చర్చి ఫాదర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలిక చెప్పేదంతా అవాస్తవాలనీ, తమకు ఏమీ తెలియదని ఆ నలుగురు చెబుతుండటం గమనార్హం.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Chennai, Crime news, CYBER CRIME, Hyderabad, Tamil nadu, Telangana crime

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు