CHENNAI MANS PUTS WIFE PHOTO AS WHATSAPP DISPLAY PICTURE CYBER SCAMSTER MORPHED PHOTO AND DEMANDED MONEY SK
Whatsapp: మీ భార్య ఫొటోను వాట్సప్ డీపీగా పెడుతున్నారా? ఐతే తస్మాత్ జాగ్రత్త..
ప్రతీకాత్మకచిత్రం
Whatsapp: వాట్సప్‌ను అడ్డుపెట్టుకొని..కొందరు కేటుగాళ్లు.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారిని టార్గెట్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. అందుకే డీపీలుగా భార్య ఫొటోలు పెట్టుకునే వారు అప్రమత్తంగా ఉండాలి.
మనలో చాలా మంది ఫేస్బుక్ (Facebook), ట్విటర్ (Twitter), వాట్సప్ (Whatsapp) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని వాడుతున్నాం. ఇందులో వాట్సప్‌ను వాడుతున్న వారు కోట్లాది మంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ వాట్సప్ అప్లికేషన్‌ను వాడుతారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో చాట్ చేయాలన్నా.. ఆడియో, వీడియో కాల్స్ చేయాలన్నా.. వాట్సప్ ఉండాల్సిందే. అంతేకాదు డాక్యుమెంట్లు పంపుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అందుకే వాట్సప్‌కు బీభత్సమైన క్రేజ్ ఉంది. వాట్సప్ లేనిదే మనలో చాలా మందికి రోజు గడవదు. ఐతే ఇదే వాట్సప్‌ను అడ్డుపెట్టుకొని..కొందరు కేటుగాళ్లు.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారిని టార్గెట్ చేసి డబ్బులు దండుకుంటున్నారు.
వాట్సప్ వాడే వారు..తమ డిస్ప్లే పిక్చర్ (Whatsapp DP)గా ఎదో ఒక ఫొటోను పెడుతుంటారు. . కొందరు తమ ఫొటోలను పెట్టుకుంటే.. ఇంకొందరు దేవుళ్లు, ఇతర ఫొటోలను డీపీలుగా పెడుతుంటారు. మరికొందరేమో తమ జీవిత భాగస్వామి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టేస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు తమ శ్రీమతి ఫొటోలనే డీపీలుగా సెట్ చేస్తుంటారు. భార్యపై తమ ప్రేమను చాటుకునేందుకు ఇలా చేస్తుంటారు. కానీ ఇదే ఇప్పుడు కొంప ముంచుతుంది. డిపిలో ఉన్న మహిళల ఫొటోలను కొందరు కేటుగాళ్లు డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు. వాటిని అసభ్యకరంగా మార్చి.. తిరిగి భర్తలకే పంపుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. చెన్నైలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది?
చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన భార్య ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్నాడు. ఐతే ఓ సైబర్ నేరగాడు ఆ ఫొటోను డౌన్లోడ్ చేశాడు. అనంతరం మార్ఫింగ్ చేసి.. నగ్న చిత్రంగా మార్చేశాడు. అనంతరం ఆమె భర్తకే ఆ ఫొటోను పంపించాడు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి తన భార్య నగ్న ఫొటో రావడంతో.. ఆమె భర్త షాక్ తిన్నాడు. ఎవరు మీరు? ఏంటిది? అని అడిగితే.. అవతలి వ్యక్తి నుంచి సమాధానం లేదు. డబ్బులు పంపాలని..లేదంటే ఆ ఫొటోను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని సందేశం పంపించాడు. బాధితురాలి భర్త ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయానవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు. ముఖ్యంగా తమ ఫొటోలను డీపీలుగా పెట్టుకునే వారు అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇలాంటి అనుభవం ఎదురైతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.