Wife-Husband-Lover: ప్రేయసి కోసం ‘హలో బ్రదర్’ స్టోరీ చెప్పాడు.. చివరకు ఇలా బుక్ అయ్యాడు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Wife-Husband-Lover: అతడికి వివాహం జరిగి.. ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా అతడు తన కొలీగ్ పైన మనసు పారేసుకున్నాడు. పెళ్లైన విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచాడు. ఇలా అతడు ఆమెను నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. చివరకు ఏమైందంటే..

  • Share this:
    అతడికి వివాహం జరిగి.. ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా అతడు తన కొలీగ్ పైన మనసు పారేసుకున్నాడు. పెళ్లైన విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచాడు. ఇలా అతడు ఆమెను నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. తర్వాత తెలిసిన వాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న సదరు మహిళ నీకు పెళ్లైందా.. నాకు అబద్దం చెప్పావా.. అంటూ ఆమె అతడిని నిలదీసింది. ‘హే అదేం కాదు .. నీకు ఎవరో అబద్దం చెప్పారు.. అది నేను కాదు.. మా అన్న’ అంటూ అతడు తెలుగులో వచ్చిన హలో బ్రదర్ సినిమా స్టోరీ చెప్పాడు. ఇలా ఆరోజు అతడు ఎలాగోల తప్పించుకున్నాడు. కానీ మరోసారి ఇలానే దొరికిపోయాడు. ఈ సారి ఆమె నిలదీసింది.. దీంతో అతడు ఆమెపై యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని అరుంబక్కమ్ కు చెందిన వలందర్ బెన్నెట్ ర్యాన్ (30)కు అందకముందే వివాహం జరిగింది.

    అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా అతడి వక్రబుద్ది మారలేదు. తన తోటి ఉద్యోగి అయిన 21 ఏళ్ల రమ్య(పేరు మార్చాం)తో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అప్పటి నుంచి అతడు వివాహ విషయం బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు. చివరకు నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అంతే కాకుండా ఆ యువతి కుటుంబసభ్యుల నుంచి రూ.3.5 లక్షలు కట్నం కింద వసూలు చేశాడు. అయితే రమ్యకు ఓ స్నేహితుడు అతడికి అంతక ముందే పెళ్లి అయిందని చెప్పాడు. దీంతో అతడిని నిలదీయగా.. షాక్‌ తిన్న ర్యాన్ ఆ తర్వాత తేరుకుని పెళ్లి అయింది నాకు కాదు. తన బ్రదర్ కు అని హలో బ్రదర్ సినిమా చెప్పాడు.

    Read Also: పెళ్లికాని యువతులతో బలవంతపు పెళ్లిళ్లు.. లైంగిక దాడులు..

    మేమిద్దరం కవలలం అని.. చూడటానికి ఇద్దరం ఒకే విధంగా ఉంటామని నమ్మించాడు. అప్పటి వరకు ఆమె నమ్మింది.. ఆరోజు ఎలాగోలా తప్పించుకున్నాడు. తన బ్రదర్ దుబాయ్ లో సెటిల్ అయ్యాడంటూ కూడా ఆమెకు చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత కొన్నాళ్లు మళ్లీ రమ్యకు విషయం తెలిసింది. దీంతో ఆమె అతడిని గట్టిగా నిలదీసి.. కట్నం కింద తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగింది. ఈ సారి అతడు తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. డబ్బుల మాటెత్తితే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో రమ్యతో పాటు వాళ్ల కుటుంసభ్యలు పోలీసులను ఆశ్రయించారు. ర్యాన్, అతడి తల్లి సెలీనా ర్యాన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న వాళ్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published: