ఏడుగురు మహిళల్ని పెళ్లి చేసుకొని.. మరో ఆరుగురితో శారీరకంగా..

రాజేశ్ పృథ్వీ(42) చెన్నైలో ఉంటూ అక్కడి నెల్సన్ మనిక్కమ్‌ ప్రాంతంలో ఓ టెలీ మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఆ కంపెనీలో 22 మంది అమ్మాయిలను రిక్రూట్ చేసుకొని, ఒకరికి తెలీకుండా మరొకరిని.. ఇలా ఏడుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. మరో ఆరుగురిని శారీరకంగా వేధిస్తూ, లైంగిక దాడులకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: September 16, 2019, 12:18 PM IST
ఏడుగురు మహిళల్ని పెళ్లి చేసుకొని.. మరో ఆరుగురితో శారీరకంగా..
రాజేశ్ పృథ్వీ (File)
  • Share this:
చదివింది ఏడో తరగతి.. అదీ మధ్యలోనే ఆపేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా అవతారం ఎత్తాడో ఘరానా మోసగాడు. పోలీస్ యునిఫాంలో ఫోటోలు దిగి.. తాను పోలీసునని నమ్మించాడు. రెండు ఎన్‌కౌంటర్లు చేసిన కేసులో తనను సస్పెండ్ చేశారని, దాంతో యూనిఫాం కోల్పోవాల్సి వచ్చిందని చెబుతూ వచ్చాడు. 2017లో ఓ ప్రైవేటు టెలీ మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేసి అమ్మాయిలను రిక్రూట్ చేసుకున్నాడు. అలా ఆ అమ్మాయిల్లో ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఓ అమ్మాయి కిడ్నాప్‌ కేసులో అతడ్ని విచారించగా ఈ ఢొంకంతా కదిలింది. రాజేశ్ పృథ్వీ(42) చెన్నైలో ఉంటూ అక్కడి నెల్సన్ మనిక్కమ్‌ ప్రాంతంలో ఓ టెలీ మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఆ కంపెనీలో 22 మంది అమ్మాయిలను రిక్రూట్ చేసుకొని, ఒకరికి తెలీకుండా మరొకరిని.. ఇలా ఏడుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. మరో ఆరుగురిని శారీరకంగా వేధిస్తూ, లైంగిక దాడులకు పాల్పడ్డాడు.

అయితే, తన కూతురు(18) కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో రాజేశ్ కిడ్నాప్ చేశాడని తేలింది. ఆమెను కాపాడిన పోలీసులు.. రాజేశ్‌ను పెళ్లాడినట్లు గుర్తించారు. రాజేశ్‌ను తమదైన శైలిలో విచారించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కంపెనీ పెట్టి రూ.30 లక్షల వరకు మోసం చేశానని తెలిపాడు. వాస్తవానికి ఇతగాడి పేరు దినేశ్ అని.. వేర్వేరు పేర్లతో, ఫేక్ ఆధార్, ఫేక్ ఐడీ ప్రూఫ్‌లతో చెలామణీ అవుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>