హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఓవైపు దేశమంతా హైఅలర్ట్‌లో ఉంటే.. ఆ తాగుబోతు పోలీసులను హడలెత్తించాడు..

ఓవైపు దేశమంతా హైఅలర్ట్‌లో ఉంటే.. ఆ తాగుబోతు పోలీసులను హడలెత్తించాడు..

Drunk man makes hoax bomb threat call : దేశంలోని ప్రధాన నగరాల్లో వచ్చే 72 గంటల పాటు హైఅలర్ట్ కొనసాగనుంది. ఇలాంటి తరుణంలో ఓ తాగుబోతు చేసిన పని చెన్నై పోలీసులను హడలెత్తించింది.

  భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన దేశ ప్రజల్లో నెలకొంది. పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ శిబిరాలపై భారత్ దాడుల తర్వాత.. పాక్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో వచ్చే 72 గంటల పాటు హైఅలర్ట్ కొనసాగనుంది. ఇలాంటి తరుణంలో ఓ తాగుబోతు చేసిన పని చెన్నై పోలీసులను హడలెత్తించింది.

  మంగళవారం చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బాంబు దాడి జరగబోతుందని చెప్పాడు. ఈ విషయం గురించి తన భార్య ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా విన్నానని.. ఇందులో ఆమె ప్రమేయం ఉందని తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో అణువణువు గాలించారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు దొరక్కపోవడంతో.. సదరు వ్యక్తి ఫేక్ కాల్ చేసినట్టు గుర్తించారు.

  ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీయగా.. అతని పేరు శరవణన్(37) అని, తెయ్నంపేట్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తాడని గుర్తించారు. భార్య మున్నీతో అతనికి విభేదాలున్నాయని, ఇద్దరూ తరుచూ గొడవపడుతుంటారని తేల్చారు. ఈ నేపథ్యంలోనే భార్యపై కక్ష సాధించేందుకే ఫేక్ కాల్ చేసి.. ఆమెను ఇరికించే ప్రయత్నం చేసినట్టుగా నిర్దారించారు. తాగిన మత్తులోనే అతను ఫేక్ కాల్ చేసినట్టు నిర్దారించారు. శరవణన్ భార్య మున్నీకి అసలు ఈ విషయం తెలియదని, ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

  First published:

  Tags: Chennai, India VS Pakistan, Pulwama Terror Attack, Tamilnadu

  ఉత్తమ కథలు