CHENNAI CUSTOMS SEIZE 2 42 KG GOLD FOREIGN CURRENCIES WORTH RUPEES 1 CRORE 35 LAKHS MS
Gold Smuggling: చాలా పెద్ద మోసం ఇది.. చెన్నైలో భారీ ఎత్తున బంగారం, నగదు పట్టివేత..
Image credits to twitter
Gold Smuggling: అధునాతన సాంకేతికత ఎంతగా పెరుగుతున్నా.. బంగారం స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. మోసగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో కస్టమ్స్ అధికారులు కనిపెట్టలేని చోట.. వారికి దొరకకుండా బంగారాన్ని విదేశాల నుంచి తరలిస్తూనే ఉన్నారు.
ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల వద్ద కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా ఉంచినా.. అధునాతన సాంకేతికత ఎంతగా పెరుగుతున్నా.. బంగారం స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. మోసగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో కస్టమ్స్ అధికారులు కనిపెట్టలేని చోట.. వారికి దొరకకుండా బంగారాన్ని విదేశాల నుంచి తరలిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విమానాశ్రయాలలో అయితే.. ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే చెన్నై ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి తన చెప్పులలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా కస్టమ్స్ ఆఫీసర్స్ చేసిన సెర్చ్ లో భారీ బంగారం.. నగదు నిల్వలు బయటపడ్డాయి.
వివరాల్లోకెళ్తే... మూడు వేర్వేరు ఘటనల్లో చెన్నై విమానాశ్రయంలోని ఎయిర్ కస్టమ్స్ అధికారులు 2.42 కిలోల బంగారం రూ .1.35 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన ఫ్లైట్ నెం. IX-1644 లో ఏడుగురు ప్రయాణికుల దగ్గర్నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆ ఏడుగురి మీద అనుమానంతో అధికారులు వారిని అడ్డగించి.. వారి దగ్గరున్న సామానును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Chennai Air Customs:2.4 kg gold worth Rs.1.23 cr. seized from 15 pax arrv frm Dubai by IX1644, FZ8517; gold chains, bits ,coins & foils we're recovered 2) 11000 USD & 19500 SAR worth Rs.12 lakhs seized frm pax departing to Dubai by flt IX1643 under CAct r/w FEMA. Pax arrested. pic.twitter.com/h4skuYYMXM
తనిఖీలలో భాగంగా నిందితుల దగ్గర రూ. 56 లక్షల విలువైన 1.10 కిలోల బరువున్న 12 బంగారు గొలుసులు, 5 బంగారు నాణేలు, 2 బంగారు ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. మోసగాళ్లు.. బంగారు గొలుసులను హ్యాండ్‌బ్యాగుల్లో, మొబైల్ కవర్లలో దాచారు. మరో ఘటనలో.. దుబాయ్ ఫ్లైట్ ఎఫ్‌జెడ్ 8517 నుంచి దిగిన ఎనిమిది మంది ప్రయాణికుల దగ్గర 17 బంగారు కట్ బిస్కెట్స్, 10 బంగారు గొలుసులు మొత్తం కలిసి.. రూ . 67 లక్షల విలువైన 1.32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అంతేగాక.. విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 1643 లో దుబాయ్‌కు వెళ్తున్న రామనాథపురానికి చెందిన షౌకత్ అలీ (28) ను కస్టమ్స్ ఆఫీసర్స్ అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర సుమారు రూ .12 లక్షలకు సమానమైన సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.