ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేసి హైడ్రామా... మోస్ట్ ట్విస్టెడ్ క్రైమ్ కేసు...

Sodium Cyanide : ప్రేమించినంతకాలం... నువ్వే నా ప్రాణం అంటారు. తీరా ప్రాణాలు తీసేస్తూ... చావవే చావు అంటారు... ఇలాంటి లవర్స్‌తో ప్రమాదమే.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 3:03 PM IST
ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేసి హైడ్రామా... మోస్ట్ ట్విస్టెడ్ క్రైమ్ కేసు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చెన్నైలో జరిగిందీ ఘటన. రెండేళ్ల కిందట... సుమేర్ సింగ్, కాజల్ కుమారీ మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా రొటీన్ లవ్ స్టోరీలా మారింది. అంతే రొటీన్‌గా ఆమె తల్లిదండ్రులు ఈ లవ్ ట్రాక్‌ని ఒప్పుకోలేదు. అమ్మానాన్నలకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని... జీవితాంతం వాళ్లను బాధపెట్టడం కరెక్టు కాదనుకున్న కాజల్ కుమారీ... తనను మర్చిపోమని సుమేర్ సింగ్‌తో అంటూ... బ్రేకప్ చెప్పింది. అక్కడితో ఆమెను మర్చిపోయి ఉంటే... సుమేర్ సింగ్ ఓ మంచి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచేవాడే. ఎందుకంటే మనం ప్రేమించేవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ కదా. కానీ... ఈ రొటీన్ స్టోరీలో కొన్ని ట్విస్టులు మొదలయ్యాయి.

సుమేర్ సింగ్ మంచివాడు కాదనుకున్న కాజల్ కుమారీ తల్లిదండ్రులు... ఆఘమేఘాలపై ఆమెకు వేరే సంబంధం చూశారు. ఐతే... బ్రేకప్ చెప్పినంత తేలిక కాదు కదా... ప్రేమించిన వాళ్లను మర్చిపోవడం. కాజల్ కుమారీకి... వేరే సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. అలాగని సుమేర్‌ని చేసుకొని... తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే చూస్తూ జీవించడం కూడా తన వల్ల కాదనుకుంది. అందుకే... సుమేర్ దగ్గరకు వెళ్లి మనం సూసైడ్ చేసుకుందాం అంది. అప్పటికప్పుడు ఆమె అలా అడిగేసరికి... సుమేర్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. "నీకు నా మీద ప్రేమ లేదా... నేను సూసైడ్ చేసుకుంటే... నువ్వు హ్యాపీగా ఉండగలవా?" అని అడిగింది. ఉండలేనన్నట్లు తలూపాడు. అందుకే ఇద్దరం చచ్చిపోదాం అంది. ఈసారి సరే అన్నట్లు తలూపాడు. లోలోపల మాత్రం సూసైడ్ ఆసక్తి అతనికి లేదు.

జూన్ 10. ఇద్దరూ కలిసి ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం తనతో ముంబై నుంచీ తెచ్చిన సోడియం సైనైడ్‌ను రెండు కూల్ డ్రింక్స్‌లో కలుపుతున్నట్లు చెప్పాడు. నిజానికి ఆమెకు ఇవ్వాలనుకున్న కూల్‌డ్రింకులో మాత్రమే కలిపాడు. ఆ తరవాత ఇద్దరూ చెరో కూల్ డ్రింక్ తీసుకున్నారు. ఇద్దరూ తాగబోతుంటే... ఆమెను అడ్డుకున్నాడు. "ముందు నేను తాగి చనిపోతాను. ఎందుకంటే నువ్వు చనిపోతూ ఉంటే నేను చూడలేను" అన్నాడు. అయ్యో తనపై ఎంత ప్రేమ దాచుకున్నాడో అనుకుంది.

ఆమె చూస్తుండగానే... తన కూల్‌డ్రింక్‌ను తాగాడు. వీర లెవెల్లో నటించాడు. గొంతు పట్టేసినట్టు, పొట్టలో తిప్పేస్తున్నట్లు యాక్షన్ చేసి... సినిమాల్లో చూపించినట్లుగా ఆమెను చూస్తూ... తల పక్కకు తిప్పేసి అలా ఉండిపోయాడు. అంతే... చచ్చిపోయాడు అనుకుంది. ఇక తన వంతు అనుకుని తాగేందుకు సిద్ధమైంది. సరిగ్గా ఆ టైంలో... సుమేర్ కళ్లు కదలడాన్ని చూసింది. ఆశ్చర్యపోయింది. ఏయ్... నీ కళ్లు కదిలాయి... నువ్వు నిజంగా సోడియం సైనైడ్ తాగావా... డ్రామా చేస్తున్నావా అంది. అంతే... నిజం బయటపడిపోవడంతో... అతనిలో రాక్షసుడు బయటికి వచ్చాడు.

ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. బెడ్‌పై దుప్పటిని ఆమె మెడకు చుట్టి గట్టిగా లాగాడు. అంతే... ఊపిరాడక విలవిలలాడింది. చివరకు మాజీ ప్రేమికుడి చేతిలో ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత సుమేర్ మరో డ్రామా.

సుమేర్ ఎంతకీ హోటల్ గది తెరవకపోవడంతో... దాని మేనేజ్‌మెంట్ డూప్లికేట్ కీతో డోర్ తెరిచింది. (ఆ డోర్ తెరిచేలోపే... చనిపోయిన కాజల్ కుమారీ నోట్లో సోడియం సైనైడ్ కలిపిన డ్రింక్ పోశాడు.) వెంటనే వీర లెవెల్లో నటించాడు. తన ప్రేయసి... తనకు చెప్పకుండా కూల్ డ్రింకులో విషం కలుపుకొని తాగి చనిపోయిందని ఏడ్చేశాడు. కానీ... పోస్ట్ మార్టం రిపోర్టులో అసలు విషయం తెలిసిపోయింది. గొంతు నొక్కడం వల్లే ఆమె చనిపోయిందని... ఆమె మెదడులో కదలికలు అదే విషయాన్ని చెప్పాయని తేల్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్.

అనారోగ్యంగా ఉందంటూ... దాదాపు నెల పాటూ రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో తిష్టవేసిన సుమేర్... చివరకు డిశ్చార్జి అయ్యాడు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసిన పోలీసులు... జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇలా ఓ ఎక్స్ లవర్ ఆడిన కన్నింగ్ డ్రామాలో కాజల్ కుమారీ ప్రాణాలు కోల్పోగా... ఆమె తల్లిదండ్రులకు విషాద జ్ఞాపకాలే మిగిలాయి.
First published: July 12, 2019, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading