న్యూడ్ ఫొటోలకు ఉద్యోగాల ఆఫర్... అడ్డంగా బుక్కైన 600 మంది అమ్మాయిలు

గోతికాడ గుంట నక్కలున్నట్లే... ప్రతీ వీధిలో కేటుగాళ్లూ ఉంటారు. అప్రమత్తంగా ఉండకపోతే... నాశనమయ్యేది మన జీవితాలే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దారుణం. చెన్నైకి చెందిన ఆ కేటుగాడు... ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆడిన నాటకంలో 600 మంది అమ్మాయిలు చిక్కుల్లో పడ్డారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 10:00 AM IST
న్యూడ్ ఫొటోలకు ఉద్యోగాల ఆఫర్... అడ్డంగా బుక్కైన 600 మంది అమ్మాయిలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎవరైనా సరే... ఉద్యోగం ఇప్పిస్తానంటే... నోట్లో పంచదార పోసిన ఫీలింగ్ కలగడం ఖాయం. ఐతే... మనకు మాట ఇచ్చేవాళ్లు ఎలాంటి వాళ్లు, వాళ్లకు ఉద్యోగం ఇప్పించేంత సీన్ ఉందా? వాళ్లు చెప్పేది నిజమేనా? వంటివి ఆలోచించుకోవాల్సింది మనమే. కంగారుపడి కమిట్ అయితే... అంతకంటే ప్రమాదం ఏముంటుంది. ఈ కథలో కేటుగాడు ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ. తమిళనాడుకు చెందిన ప్రదీప్ (33)... ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సైలెంట్‌గా తన జాబేదో తాను చేసుకోకుండా... ఫేస్‌బుక్‌లో అర్చనా జగదీష్ పేరుతో ఓ అకౌంట్ తెరిచాడు. ఆమె ఓ కన్సల్టెన్సీ కంపెనీ HR అని రాశాడు. ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే... మెసేజ్ పంపమని చెప్పాడు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు, యువతులు... తమకు ఉద్యోగం కావాలని మెసేజ్‌లు పంపేవాళ్లు. వాళ్ల ఫోన్ నంబర్ తెలుసుకొని... కాల్ చేశేవాడు. అర్చనా జగదీష్ తాలూకా అని చెప్పేవాడు. ఇంటర్వ్యూ చేస్తున్నానంటూ... మాయమాటలు మాట్లాడేవాడు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్లను నమ్మించేవాడు. అలా వాళ్లతో కనెక్ట్ అయ్యేవాడు.

ఒక్కసారి అమ్మాయిలు తనకు కనెక్ట్ అవ్వగానే... "ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్ జాబ్‌ చెయ్యాలంటే అందంగా ఉండాలనీ, మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఉండాలి" అని చెప్పేవాడు. "అలా ఉన్నవాళ్లకు మాత్రమే ఉద్యోగం ఇవ్వగలం" అని చెప్పి... "మీరు అలా ఉన్నారో లేదో నాకు తెలియాలి. కాబట్టి మీ నార్మల్ ఫొటోలు, న్యూడ్ ఫొటో పంపిస్తే... చెక్ చేసి... జాబ్‌కి సెలెక్ట్ చేస్తాం"... అనేవాడు... న్యూడ్ ఫొటో ఎందుకని అడిగితే... "ఆ ఫొటోను బట్టీ... ఫిజిక్ ఎలా పెంచుకోవాలో, ఏయే మార్పులు చేసుకోవాలో చెబుతాం" అని అనేవాడు. మంచి జీతం వస్తుందని ఆశ కలిగించాడు.

ఆ దుర్మార్గుడిని నమ్మి... దేశంలో 16 రాష్ట్రాలకు చెందిన... 600 మంది మహిళలు, యువతులు తమ న్యూడ్ పిక్స్ పంపినట్లు సైబరాబాద్, మియాపూర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్క హైదరాబాద్‌లోనే 60 మంది బాధితులు ఉన్నట్లు తేలింది. న్యూడ్ ఫొటోలు పంపిన అమ్మాయిలకు ఫోన్లు చేసి... డబ్బులు పంపాలనీ, లేదంటే ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి... పరువు తీస్తానని బెదిరించేవాడు. ఈ బ్లాక్‌మెయిల్ ఉచ్చులో పడి చాలా మంది అమ్మాయిలు... అతనికి చాలా డబ్బులు సమర్పించుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహిత (29)... అతని వేధింపులు తట్టుకోలేక... మియాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులు... కేటుగాణ్ని పట్టుకుని... కటకటాల వెనక్కి నెట్టారు.
Published by: Krishna Kumar N
First published: August 24, 2019, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading