హోమ్ /వార్తలు /క్రైమ్ /

మీ ఫోన్‌లో ‘ఆ వీడియోలు’ ఉన్నాయా... అయితే జైలుకి వెళ్లక తప్పదు...

మీ ఫోన్‌లో ‘ఆ వీడియోలు’ ఉన్నాయా... అయితే జైలుకి వెళ్లక తప్పదు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

18 ఏళ్లలోపు ఆడా, మగ ఎవ్వరిపైనైనా లైంగిక దాడికి పాల్పడితే... వారికి ఉరిశిక్ష.... సెక్స్ వీడియోలు ఫార్వర్డ్ చేసినా, చూసి చెప్పకపోయినా నేరమే...

మీ ఫోన్‌ను మరోసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోండి. ‘పోర్న్’ చూసేవారైతే మరింత జాగ్రత్తగా చూడండి. పిల్లలపై తీసిన పోర్న్ చిత్రాలు కానీ, పిల్లలను టార్గెట్ చేస్తూ చేసిన అశ్లీల వీడియోలు గానీ ఫోన్‌లో ఉంటే వారికి భారీ జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. పొరపాటున వీడియో బాగుంది కదా అని స్నేహితులతో షేర్ చేస్తే... జైలుశిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలపై జరుగుతున్న వరుస నేరాలను నిరోధించేందుకు వీలుగా... ‘పోక్సో’ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రి వర్గం. ఈ సవరణల ప్రకారం 18 ఏళ్లలోపు ఆడా, మగ ఎవ్వరిపైనైనా లైంగిక దాడికి పాల్పడితే... వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే చాలారాష్ట్రాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారలకు పాల్పడేవారికి మరణశిక్ష విధిస్తున్నారు. ఇకపై దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి అనుసరించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా యవ్వనదశకు రాకముందే హర్మన్ ఇజక్షన్లను ద్వారా లైంగికంగా ప్రేరేపిస్తున్నవారికీ కఠిన శిక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్నపిల్లలతో తీసిన పోర్న్ చిత్రాలు... ఆన్‌లైన్‌లో లేకుండా చర్యలు తీసుకురాబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఎవ్వరిదగ్గరైనా పిల్లల నీలిచిత్రాలు కలిగి ఉన్నా, వాటిని డిలీట్ చేయకపోయినా భారీ జరిమానా విధించబోతున్నారు. అలాంటి వీడియోలను షేర్ చేసినా, ఫార్వర్ట్ చేసినా జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా పడనుంది. ఎవ్వరో ఫార్వర్డ్ చేసిన వీడియోలను చూసి, డిలిట్ చేసి... ఆ సమాచారం పోలీసులకు తెలపకపోయినా నేరం కిందే పరిగణిస్తారు. సీరియల్స్, సినిమాలు, ప్రకటనలు... ఇలా వాణిజ్య అవసరాల కోసం ఇలాంటి చిన్నపిల్లల వీడియోలను అసభ్యకరంగా చూపిస్తే... వారిని కూడా క్రిమినల్ నేరస్థులుగానే పరిగణించబోతున్నారు.

ఇవి కూడా చదవండి...

దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...


భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...


బాలికపై అత్యాచారం, హత్య..మాజీ ఎమ్మెల్యేకి పదేళ్లు జైలు

కోతికి చక్కలిగింతలు పెట్టినందుకు మూడు సంవత్సరాలు జైలు.. ఎక్కడో తెలుసా...!

8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

First published:

Tags: Crime

ఉత్తమ కథలు