మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్... నగలు, నగదుతో యువతి పరార్

అనీషా కేసును విచారణ చేసిన పోలీసులకు అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. గతంలో కూడా అనీషా పలువురిని ఇలాగే మోసం చేసిందని గుర్తించారు పోలీసులు.

news18-telugu
Updated: January 13, 2019, 8:17 AM IST
మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్... నగలు, నగదుతో యువతి పరార్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 13, 2019, 8:17 AM IST
మీకు పెళ్లి కాలేదా? మ్యాటిమోనిలో ప్రొఫైల్ పెట్టారా ? అయితే జాగ్రత్త. అందమైన అమ్మాయిలు ఫోటోలు చూసి మెల్ట్ అయిపోకండి. కేస్ట్ , బ్యాక్ గ్రౌండ్ చూసి గుడ్డిగా నమ్మేయకండి. ఎందుకంటే ఈ మధ్య ఫేస్ బుక్ ప్రేమలు, మ్యాట్రిమోని సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకున్నవారు చివరికి మోసపోతున్నారు. ఎందుకంటే పంజాబ్‌లో ఇలాంటి ఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన రాజేష్ భాటియా కోసం ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మ్యాట్రిమోనిలో రాజేష్ డిటైల్స్ పెట్టారు. ఇంతలో అనీషా అనే అమ్మాయి ప్రొఫైల్‌ చూసి ఇష్టపడ్డాడు. అమ్మాయి కూడా రాజ్‌ఫుత్ కావడంతో పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లైన రెండు వారాలకే రాజేష్ భాటియా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయాడు. అంతే అనుకున్న ప్లాన్‌ను అమలు చేసింది అనీషా. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నగలు, డబ్బు తీసుకొని ఉడాయించింది.

దీంతో షాక్ అయిన రాజేష్ కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అమృతసార్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అనీషా కేసును విచారణ చేసిన పోలీసులకు అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. గతంలో కూడా అనీషా పలువురిని ఇలాగే మోసం చేసిందని గుర్తించారు పోలీసులు. అంతేకాదు అనీషాను తన తండ్రి ఇంటి నుంచి బయటకు గెంటేసినట్లుగా కూడా తెలిసింది.

తప్పుదారిలో నడుస్తుండటంతో కన్నతండ్రే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. నిందితురాలు జమ్ము కాశ్మీర్ నివాసి అహ్మద్ ముష్తాక్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. కన్నకూతురు తీరు నచ్చక, ఇంటి నుంచి తండ్రీ ఆమెను వెళ్లగొట్టాడు. ఆపై ఆమె, పంజాబ్ వెళ్లి, రాజ్ పుత్ గా పేర్కొంటూ, ఓ వెబ్ సైట్లో ప్రొఫైల్ ఉంచి ఇలా మోసాలకు పాల్పడి కటకటాలు పాలైంది.

ఇవి కూడా చదవండి :కుక్కకి‌ పెద్దకర్మ ... ఖమ్మంలో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం

యూనివర్శిటీలో గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దుమారం... ఇద్దరు అరెస్టు
First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...