హోమ్ /వార్తలు /క్రైమ్ /

Cheating: జాతకాల పేరుతో మోసం.. మీ ఇంట్లో లచ్చిందేవి ఉందంటూ సొమ్ముతో ఉడాయించిన గుర్తుతెలియని మహిళలు.. ఎక్కడో తెలుసా..

Cheating: జాతకాల పేరుతో మోసం.. మీ ఇంట్లో లచ్చిందేవి ఉందంటూ సొమ్ముతో ఉడాయించిన గుర్తుతెలియని మహిళలు.. ఎక్కడో తెలుసా..

Cheating: లచ్చిందేవి.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. అంటూ సినిమాలో రవితేజ , బ్రహ్మానందం మోసం చేసి డబ్బులు సంపాదించడం చూశాం. అలాంటి సీన్ మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మీ ఇంట్లో ధనం ఉందని వాటిని బయటకు తీయాలంటే పూజలకు ఖర్చు అవుతుందని చెప్పి రూ. లక్ష నగదు, మూడు తులాల బంగారం పట్టుకొని పారిపోయారు.

ఇంకా చదవండి ...

  టెక్నాలజి ఎంత అభివృద్ధి చెందుతున్నా మూర్ఖుల్లో మాత్రం మార్పు రావడం లేదు. జాతకాల పేరుతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే సూర్యాపేటలో నాగదోశం ఉందని ఓ తల్లి తన కన్నబిడ్డను గొంతు కోసి చంపేసింది. ఇలా మూఢనమ్మకాలను నమ్మేవారు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు. వాటి కారణంగా సొంత బంధువులనే పోగుటుకుంటున్నారు. దీని వల్ల ప్రాణ నష్టం తో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇలా ఓ ఇంట్లో ఓ మహిళకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో..  క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం నయమవుతుందని మాయమాటలు చెప్పి నగదు, బంగారుతో దుండగులు పరారయ్యారు. దీనిపై మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జీఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు బిజినపల్లి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. బిజినపల్లి మండలం మంగనూర్‌కి చెందిన పుష్ప తల్లి మాణిక్యమ్మకు రెండు నెలల నుంచి ఆరోగ్యం బాగా ఉండటం లేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన తన ఆరోగ్యం మెరుగుపడటం లేదు. ఈ క్రమంలో ఆ గ్రామానికి కొన్ని రోజుల కిందట గుర్తుతెలియని మహిళలు వచ్చి జాతకం చెబుతామంటూ తిరిగారు. వారు అలా జాతకం చెప్పుకుటూ పుష్ప ఇంటికి వచ్చారు. పుష్పకి ఆరోగ్యం నయం కావడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు చెప్పడంతో దీనిని వారు అవకాశంగా తీసుకున్నారు.

  మీ ఇంట్లో ధనం ఎక్కువగా ఉంది. దాని వల్లనే మీ అమ్మకు ఆరోగ్యం క్షిణిస్తుందని, నయం చేసేందుకు మీ ఇంట్లో క్షుద్రపూజలు చేసి ధనం తీస్తే ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. దీంతో వారు ధనం రావడంతో పాటు ఆర్యోగ్యం బాగవుతుందని భావించారు. వారు చెప్పిన దానికి అంగీకరించారు. అయితే మూడు రోజుల పాటు ఈ పూజలు కొనసాగుతాయని నమ్మబలికారు. అయితే ఆ ధనం తీసేందుకు పూజ సామాన్లు, సామగ్రి కావాలని చెప్పారు. వారు స్థానికంగా ఉన్న దుకాణంలో తెస్తా అని చెప్పినా వారు వినలేదు. మీము తెచ్చే పూజ సామాన్లు పవిత్రమైనవని నమ్మిచి వారి నుంచి రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం తీసుకున్నారు. వారిని నమ్మకానికి ఇంకా బలం చేకూర్చేందుకు ఇంటికి వెళ్లిన వారు ఈ నెల 14న మహబూబ్ నగర్ వచ్చి సామాన్ల కోసం పరిశీలించామని చెప్పారు.

  అవి ఇక్కడ దొరకలేదని.. దీని కోసం హైదరాబాద్ వెళ్లాలని అక్కడకు వెళ్లి తీసుకొకస్తామని చెప్పి మహిళలు వెళ్లిపోయారు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేశారు. అక్కడ నుంచి సమాధానం రాలేదు. మరోసారి ఫోన్ చేశారు. ఈ సారి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Cheating, Cheating horoscope, Crime, Crime news, Mahabubnagar, Telangana, Telangana News

  ఉత్తమ కథలు