తండ్రికి యాక్సిడెంట్ అని భర్తకు అబద్ధం చెప్పి...పుట్టింటి పేరుతో ప్రియుడితో కలిసి లాడ్జీలో దూరిన భార్య..

గత వారం తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన మామగారికి యాక్సిడెంట్ అవ్వడంతో, రణబీర్ కూడా వెంటనే తన అత్తగారింటికి బయలుదేరాడు. తన అత్తగారింటికి వెళ్లగానే అక్కడ మామగారు హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు.

news18-telugu
Updated: October 3, 2020, 9:41 PM IST
తండ్రికి యాక్సిడెంట్ అని భర్తకు అబద్ధం చెప్పి...పుట్టింటి పేరుతో ప్రియుడితో కలిసి లాడ్జీలో దూరిన భార్య..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వివాహేతర బంధాలు కుటుంబాలను నిలువునా చీల్చేస్తున్నాయి. దంపతులను నేర ప్రవృత్తితో ప్రవర్తించే స్థాయికి దిగజారిపోతున్నారు. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పెళ్లికి ముందు ఉన్న ప్రియుడితో తమ సంబంధాల మోజులో పడి ఉన్న కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహితకు పెళ్ళికి ముందే ప్రియుడు ఉన్నాడు. అతనితో ఆమెకు శారీరక సంబంధం కూడా ఉంది. పెద్దల ప్రోద్బలంతో పెళ్లి కావడంతో ఆమెకు మూడేళ్లుగా తన భర్తతో కాపురం చేస్తోంది. అయితే ప్రియుడిని మరిచిపోలేక అస్తమానం ఏదో ఒక నెపంతో పుట్టింటికి వెళ్తూ...ప్రియడి దగ్గరే ఆమె ఎక్కువ కాలం గడిపేది. భర్తకు అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. కానీ చివరకు అతడికే దొరికిపోయింది.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాకు చెందిన రణబీర్ అనే వ్యక్తికి పొరుగున వుండే పట్టణంలోని మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్ళయిన కొత్తలో బాగానే ఉన్నారు. సంవత్సరం తరువాత పదేపదే పుట్టింటికి వెళ్ళడం ప్రారంభించింది భార్య. తన కుటుంబ సభ్యులను చూడాలని, అమ్మ గుర్తుస్తోందని, తమ్ముడు గుర్తుకు వస్తున్నాడని.. ఇలా రకరకాల మాటలు చెబుతూ భర్తకు ఏదో ఒక వంక చెప్పి వెళ్లేది. నిత్యం పుట్టింటికి వెళ్తూ ఉండటంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగేది. అయితే ఆ వివాహిత తన పుట్టింటి పేరుతో ప్రియుడితో లాడ్జి గదికి వెళ్ళేది . అక్కడే రెండు మూడు రోజుల పాటు ఉండి శృంగారంలో మునిగి తేలేది.

ఇదిలా ఉంటే గత వారం తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన మామగారికి యాక్సిడెంట్ అవ్వడంతో, రణబీర్ కూడా వెంటనే తన అత్తగారింటికి బయలుదేరాడు. తన అత్తగారింటికి వెళ్లగానే అక్కడ మామగారు హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. దీంతో రణబీర్ షాక్ తిన్నాడు. అదేంటి మీకు మూడురోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యింది కదా అని ఆరా తీశాడు. అందుకు మామగారు తనకు ఏమీ కాలేదని చెప్పాడు. తన భార్య ఇంటికి వచ్చిందా లేదా అని అడిగాడు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు అన్నారు. దీంతో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా...లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే రణబీర్ భార్య ఫోన్ ట్రేసింగ్ చేయగా, అసలు విషయం తెలిసింది. ఆమె తన స్నేహితుడి ఇంటి వద్ద ఉందని తేలింది.ఆమె ఆచూకీ కనిపెట్టిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో కలిసి ఓ హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇది కళ్లారా చూసిన రణబీర్ ఖంగుతిన్నాడు. భార్యను అలా చూసి అక్కడే చితకబాదాడు. అడ్డుగా వచ్చిన స్థానికులను కూడా పక్కకు తోసేసి భార్యను కొట్టడం ప్రారంభించాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది.
Published by: Krishna Adithya
First published: October 3, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading