Nutan Naidu : నూతన్‌నాయుడుపై మరో కేసు.. ఏకంగా రూ.12 కోట్లకు టోకరా..!

దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్‌నాయుడుపై మరో కేసు నమోదైంది.

news18-telugu
Updated: September 12, 2020, 6:37 AM IST
Nutan Naidu : నూతన్‌నాయుడుపై మరో కేసు.. ఏకంగా రూ.12 కోట్లకు టోకరా..!
నూతన్ నాయుడు (File)
  • Share this:
విశాఖపట్నం : దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్‌నాయుడుపై మరో కేసు నమోదైంది. ఉద్యోగాల పేరిట ఇద్దరిని నమ్మించి మోసం చేసినందుకు మహారాణిపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. వివరాలు.. విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి మంచి స్నేహితులు. వీరిద్దరు హైదరాబాద్‌లో వారి వారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో వీరికి నూతన్‌నాయుడుతో స్నేహం కుదిరింది. దీన్ని ఆసరాగా చేసుకున్న నూతన్‌నాయుడు.. ఎస్‌బీఐలో ఉద్యోగాల ఇప్పిస్తానని చెప్పినట్టు బాధితులు తెలిపారు. ఇందుకోసం శ్రీకాంత్ రెడ్డి రూ. 12 కోట్లు, నూకరాజు రూ. 5 లక్షలు చెల్లించామని చెప్పారు. అయితే రెండేళ్లు గడిచిన నూతన్‌నాయుడు ఉద్యోగాలు ఇప్పించకపోడంతో తాము మోసపోయామని గ్రహించి వారు పోలీసులకు ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వాస్తవంగా నూతన్‌నాయుడుకు శ్రీకాంత్‌రెడ్డి రూ. 12 కోట్లు ఇచ్చడా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి నూతన్‌నాయుడుకు సన్నిహితుడిగా ఉన్న శశికాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు దళిథ యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి తన భార్యను తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్‌నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు కూడా పోలీసులు గుర్తించారు.
Published by: Sumanth Kanukuka
First published: September 12, 2020, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading