Home /News /crime /

CHARTERED ACCOUNTANT ARRESTED FOR ALLEGEDLY KILLING HIS WIFE AND MAKING IT LOOK LIKE A ROAD ACCIDENT SSR

భర్త క్రూరత్వం.. 60 లక్షల ఇన్సురెన్స్ డబ్బు కోసం భార్యను గుడికి తీసుకెళుతున్నట్టుగా నమ్మించి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుజరాత్‌లో భార్య ఇన్సురెన్స్ డబ్బుపై కన్నేసిన ఓ భర్త ఏకంగా ఆమె ప్రాణాలే తీయించాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరినీ నమ్మేట్టుగా చేసి ఇన్సురెన్స్ డబ్బులు పొందాలని చూశాడు. అయితే.. పోలీసులు ఈ వ్యక్తి ఆట కట్టించారు. పూర్తి వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని బనస్‌కాంతా జిల్లాకు చెందిన...

ఇంకా చదవండి ...
    పలన్‌పూర్: గుజరాత్‌లో భార్య ఇన్సురెన్స్ డబ్బుపై కన్నేసిన ఓ భర్త ఏకంగా ఆమె ప్రాణాలే తీయించాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరినీ నమ్మేట్టుగా చేసి ఇన్సురెన్స్ డబ్బులు పొందాలని చూశాడు. అయితే.. పోలీసులు ఈ వ్యక్తి ఆట కట్టించారు. పూర్తి వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని బనస్‌కాంతా జిల్లాకు చెందిన లలిత్ సీఏగా పనిచేసేవాడు. భార్య దక్ష్ బెన్ పేరున లలిత్ 60 లక్షలు ఇన్సురెన్స్ చేయించాడు. తన భార్యను చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే ఆ 60 లక్షలు పొందొచ్చన్న వికృతమైన ప్లాన్ వేశాడు. ఓ లారీ డ్రైవర్‌కు 2 లక్షలిచ్చి డీల్ మాట్లాడుకున్నాడు.

    డిసెంబర్ 26, 2020 ఉదయాన్నే భార్యను గుడికి తీసుకెళ్లే వంకతో ఆమెను వెంటబెట్టుకుని వెళ్లిన లలిత్.. ముందుగా అనుకున్నట్టుగా లారీ దగ్గర్లోకి రాగానే ఆమెకు దూరంగా జరిగాడు. వేగంగా వచ్చిన లారీ లలిత్ భార్య దక్ష్ బెన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నిజంగానే ఆమె ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు లలిత్ నటించాడు. ఏమాత్రం అనుమానం రాకుండా మొసలికన్నీరు కార్చాడు.

    పోలీసులు రోడ్డు ప్రమాదంలో దక్ష్ బెన్ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నప్పటికీ దక్ష్ బెన్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసులో లోతుగా దర్యాప్తు జరిపారు. దీంతో.. లలిత్ కుట్ర బట్టబయలైంది. పోలీసులు లలిత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Gujarat, Husband kill wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు