ఉత్తర కాశీ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి చార్ ధామ్ యాత్రకు, యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భీతావహకంగా మారిపోయింది. బస్సు ప్రమాదంలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 6 గురు తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH | Uttarakhand: Visuals from the gorge in Uttarkashi district where a bus carrying 28 pilgrims fell down. 22 pilgrims have died & 6 people have been injured. Local administration & SDRF teams engaged in rescue work; NDRF team rushing to spot. pic.twitter.com/g0KDBRdDMe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
అధికారులు ప్రమాదం విషయం తెలియగానే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు. స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ లు,ఎన్డీఆర్ఎఫ్ లను రంగంలోనికి దింపారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనపై అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో మొత్తం 28 యాత్రికులు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గతంలో బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
పదిహేను రోజుల క్రితం కూండా బెంగళూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. హైవేపై ప్రయాణిస్తున్న కాస్లీరు ఓ కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లో చనిపోయారు. ఈ సంఘటన అర్థరాత్రి రెండు గంటల తర్వాత జరిగినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళ లోని ఓ కన్వేషన్ సెంటర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రహదారిలోని ఓ కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చేలరేగాయి.
దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు.
కాగా ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఆరుగురు మృత్యువాత పడగా మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరు కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలున్స్ తెరుచుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Uttarakhand