అమానుష ఘటన జరిగింది. మూడు రోజుల పసికందుపై కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. తల్లిదండ్రులు తమ బిడ్డ చనిపొయి ఉండటాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ విషాదకర ఘటన చంఢీఘడ్ లోని (Chandigarh) పానిపట్ లో జరిగింది. పానిపట్ లోని హార్ట్ అండ్ మదర్ కేర్ హస్పిటల్ లో జూన్ 25 న ఈ దారుణ ఘటన జరిగింది. యూపీలోని కైరానా లో ఉండే షబ్నమ్ , పానిపట్ లోనిన ఆస్పత్రిలో డెలివరీ కోసం చేరింది. దానిలో పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత.. ఆమెను జనరల్ వార్డ్ కు మార్చారు.
జూన్న 25 న రాత్రి తల్లి, ఆమె పక్కన అమ్మమ్మ ఉన్నారు. తెల్లవారు జామున.. పసికందు కన్పించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల వెతికారు. చుట్టుపక్కల వెతుకగా కొన్ని కుక్కలు (Dogs attack) పసికందును కరుస్తున్నట్లు చూశారు. వాటిని వెళ్లగొట్టారు. ఆ తర్వాత.. వైద్యులకు చూపించగా అప్పటికే శిశువు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా కుక్కలు రాత్రి ఆస్పత్రిలో ప్రవేశించి బెడ్ మీద ఉన్న శిశువును నోట కరుచుకున్నాయి. ఆ తర్వాత.. బయటకు లాక్కెళ్లాయి. పుట్టిన మూడు రోజులకే తమ పాపకు నూరెళ్లకు నిండిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న.. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆస్పత్రి నిర్వాకం వలనే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్రలో (maharashtra) అమానుషం జరిగింది.
నాగపూర్ (nagpur) ప్రాంతంలోని అమర్ నరగ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. నర్మూ సీత యాదవ్ (40), కల్పన యాదవ్ లకు 2013 లో పెళ్లి జరిగింది. ఇతను పెళ్లైనప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. ఇతడిని ఇల్లరికం (Family disputes) తెచ్చుకున్నారు. భగవాన్ రావరే (75), పుష్ప రావరే(70) లు ఇతని అత్తమామలు. అయితే, ఇంటికి వచ్చినప్పటి నుంచి అల్లుడి, కూర్చుని తింటూ.. ఏదో ఒకటి కావాలని వేధిస్తుండేవాడు. కూతురు మోహం చూసి అత్తమామలు ఏమనే వారు కాదు. ఈ క్రమంలో.. మామ..కొన్ని మేకలను విక్రయించాడు. ఇది అల్లుడికి తెలిసింది. తనకు డబ్బులను ఇవ్వాలని మామను వేధించాడు.
భార్యతో గొడవ పడ్డాడు. అల్లుడు నర్మూ సీతాయాదవ్.. ఆదివారం రాత్రి.. ఇంట్లో గొడవకు దిగాడు. తన పేరు మీద ఇంటిని రాసివ్వాలని (Dowry harassment) డిమాండ్ చేశాడు. దీంతో అత్తమామలు ప్రతిఘటించారు. దీంతొ అతను కోపంలో అక్కడ ఉన్న గొడ్డలి పట్టుకుని, అత్తమామలపై దాడిచేశాడు. వారిని ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో వారు అక్కడే కుప్పకూలి పడిపోయారు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడిచేశాడు. ఆ తర్వాత.. అక్కడినుంచి పారిపోయాడు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అత్తమామలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయారు. కూతురుని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.