కోవిడ్ తరువాత తిరుమలలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పాడుతున్నాయి. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అయితే అదే సమయంలో చైన్ స్నాచర్లు భక్తులను హాడలెతిస్తోన్నారు. గడిచిన రెండు నెలల్లో దాదాపు ఇలాంటి సంఘటనలు నాలుగు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి ఈ ముఠాల కదలికలపై రక్కి వేశారు. అయితే తాజాగా తిరుమల అలిపిరి కాలిబాటలో చైన్ స్నాచర్లు మళ్లీ హల్చల్ చేశారు.
నలుగురు వ్యక్తుల ముఠా నడకదారిలో అనుమానాస్పదంగా తిరుగుతూ....కర్నూలుకు చెందిన భక్తుని మెడలోని బంగారు గొలుసును అపహరించే ప్రయత్నం చేశారు. వెంటనే భక్తులు కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయారు దుండగలు. దీంతో జరిగిన సంఘటన పట్ల తీవ్ర భయానికి గురైన భక్తులు నడకదారిలోని కొత్త మండపం వద్దకు పరుగులు తీశారు. కొత్తమండపం వద్దకు చేరుకొని డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు పిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ దారి దోపిడిలకు పాల్పడుతున్న దుండగలు పక్కరాష్ట్రాలను నుంచి వచ్చిన ముఠాల లేకా లేదా స్థానికంగా ఉన్న కొంతమంది అల్లరి మూకలా అనే కోణంలో దార్యప్తు చేస్తోన్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.
ఇప్పటికే ప్రత్యేకమైన నిఘా ను ఏర్పాటు చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ను జల్లడపడుతున్నారు అధికారులు. దీంతోపాటు భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోన్నారు. ముఖ్యంగా కాలినడక దారిలోనే ఎక్కువగా ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచింది టీటీడీ. ఎవరైన అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. వెంటనే డయల్ 100 కి కాల్ చేసి సమాచారం అందిచాలని విజ్ఞప్తి చేశారు అధికారులు.
ఇదిలా ఉంటే తిరుమలకు కోవిడ్ తరువాత సాధారణ పరిస్థితిలల్లో క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 38,079 మంది భక్తులు తిరుమలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.56 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది . ఒక్క ఆదివారం రోజే స్వామివారికి 15,016 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chain snatching, Crime news, Tirumala, Tirupati