నిజామాబాద్ జిల్లాః మొన్నటి వరకు ఉద్యోగం చేయడంతో ఖర్చులకు ఇబ్బంది లేదు..కానీ కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఉన్న ఉద్యోగం పోయింది.. దీంతో విలాసాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు దొంగతనాలకు అలవాటుపడ్డారు. మూడు దొంగతనాలు చేసేసరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ శ్వేత వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఆలూరు సంతోష్, భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన పల్లపు సంతోష్‌లు గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వీరిద్దరూ మే 29 నుంచి మూడు చోట్ల కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్‌నగర్ కాలనీ, తాడ్వాయి మండలం చిట్యాల ప్రాంతంలో, మెదక్ జిల్లా రామాయంపేట మండలం బాగిర్థిపల్లి గ్రామ శివారులో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు ఆయా గ్రామాల పరిధిలోని సీసీ కెమెరాల్లో రికర్డు అయ్యాయి.. పోలీసులు జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. వీరి నుంచి 9.7 తులాల బంగారు పుస్తెల తాళ్లు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ పోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఆలూరి సంతోష్ వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ రెస్టారెంట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తుండగా.. పల్లపు సంతోష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ, గ్రామీణ సీఐలు జగదీష్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nizamabad, Telangana