ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి... ముగ్గురు మృతి, 19 మందికి గాయాలు...

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా విరుచుకుపడిన వేర్పాటువాదులు... పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వచ్చి పేల్చివేత...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 7:32 PM IST
ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి... ముగ్గురు మృతి, 19 మందికి గాయాలు...
ఆత్మాహుతి దాడి తర్వాత శిథిలాలను తొలగిస్తున్న పోలీస్ సిబ్బంది 9Tasnim News Agency/Reuters)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 7:32 PM IST
ఇరాన్‌లోని చాబహార్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో ముగ్గురు చనిపోగా, దాదాపు 19 మందికి తీవ్ర గాయలయ్యాయి. సిస్టన్- బలుచిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన బలూచీ వేర్పాటువాదులు, సున్నీ ముస్లింలు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వేగంగా దూసుకొచ్చిన తీవ్రవాదులు... చాబహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో కారును ఆపగానే పేల్చివేశారని అధికారులు తెలిపారు.

మొదట ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపినా... ఆ తర్వాత ఆ సంఖ్యను తగ్గించారు చాబహార్ సిటీ గవర్నర్ రెహంబెల్ బమేరీ. ‘చాబహార్ ప్రాంతంలో ఆత్మాహుతిదాడి జరిగింది. అత్యంత పేలుడు తీవ్రత కల్గిన పదార్థాలు ఉపయోగించడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా అపార్ట్‌మెంట్స్‌ అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు చనిపోయారు...’ అని పేర్కొన్నాడు బమేరీ. బాంబు దాడి జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో ఉన్న షాప్ యజమానులు, సామాన్యులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కి.మీ.ల దూరంలో ఉన్న చాబహార్ ప్రాంతంలో సున్నీ ముస్లింలు, బలూచీ కమ్యూనిటీ వారు వేల సంఖ్యలో నివసిస్తున్నారు. అయితే బలూచీ కమ్యూనిటీలు తమను పాకిస్థాన్‌లో విలీనం చేయాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య పెరిగింది. ఈ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఓమన్‌లో డీప్ వాటర్ పోర్ట్ ఉంది. భారత్ సాయంతో ఇరాన్ ఇక్కడ పవర్ అండ్ ఫ్రైట్ హబ్ డెవలప్ చేస్తోంది. దీంతో చాబహార్ ఏరియాను టార్గెట్ చేస్తూ దాడులను ప్రోత్సాహిస్తోంది పాకిస్తాన్.


First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...