డాక్టర్లను కొడితే పదేళ్ల జైలు శిక్ష.. రూ.10 లక్షల జరిమానా..

ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ సిబ్బందిపైనైనా దాడిచేస్తే.. నిందితులకు కఠిన శిక్ష వేసేలా చర్యలను ప్రతిపాదించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 6:49 AM IST
డాక్టర్లను కొడితే పదేళ్ల జైలు శిక్ష.. రూ.10 లక్షల జరిమానా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గత జూన్‌లో పశ్చిమబెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో రోగి మరణించడంతో అతడి బంధువులు ఇద్దరు జూనియర్ డాక్టర్లపై భౌతిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తీవ్రస్థాయి చర్యలకు సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ సిబ్బందిపైనైనా దాడిచేస్తే.. నిందితులకు కఠిన శిక్ష వేసేలా చర్యలను ప్రతిపాదించింది. వైద్యులపైనో.. వైద్యం మీదో.. కోపంతో విధ్వంసానికి తెగబడినా, హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు శిక్ష తప్పదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తేనుంది. 30 రోజుల లోపు ప్రజల అభిప్రాయాలు తెలపాలంటూ బిల్లు ముసాయిదాను ఆన్‌లైన్‌లో ఉంచింది.

ఈ బిల్లు ప్రకారం.. ఓ డాక్టరు లేదా నర్సు లేదా ఇతర వైద్య సిబ్బందిని కొడితే కనీసం ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. మెడికల్ సిబ్బందిని గాయపరిచినా, హింసించినా దాని స్థాయిని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్ల దాకా ఖైదు తప్పదు. కేవలం జైలే కాదు... కనీసం రూ.5వేల నుంచి రూ.5 లక్షల దాకా జరిమానా కూడా విధించవచ్చు. వైకల్యం లేదా కోలుకోలేని స్థితికి తెచ్చినా, లేక చంపినా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపు. కేసు తీవ్రతను బట్టి రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఇలా తదితర శిక్షలతో ముసాయిదాను సిద్ధం చేసింది కేంద్రం.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు