నిర్భయ కేసుపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేసి, దోషులను ఉరితీసేందుకు వీలైనంత త్వరగా డెత్ వారెంట్ జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. ఈ అంశంపై కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


Updated: February 5, 2020, 5:46 PM IST
నిర్భయ కేసుపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్
Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై... నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు
  • Share this:
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల ఉరి శిక్ష అమలుపై ట్రయల్ కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ, తాము వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేసి, దోషులను ఉరితీసేందుకు వీలైనంత త్వరగా డెత్ వారెంట్ జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. ఈ అంశంపై కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

నిర్భయ కేసులో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. నిర్భయ దోషుల ఉరిపై పాటియాలా కోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ, కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పాటియాల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు. దోషులను వేర్వేరుగా ఉరి తీయాల్సిన అవసరం లేదని.. ఒకేసారి నలుగురు దోషుల్ని ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు న్యాయపరమైన అవకాశాలకు వినియెగించుకునేందుకు దోషులకు వారం పాటు హైకోర్టు గడువు ఇచ్చింది.

2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈ కేసులో... నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్‌ని అడ్డం పెట్టుకొని దోషులు... ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలవ్వలేదు. దీనిపై విమర్శలు వస్తుండటంతో... కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు