కేరళ ఏనుగు మృతి.. కేంద్ర ప్రభుత్వం సీరియస్.. చర్యలకు ఆదేశం..

కేరళ ఏనుగు మృతి..

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

  • Share this:
    కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ట్విట్టర్ ద్వారా ఘటనపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతూ.. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ‘ఈ ఘటన మన దేశ సంస్కృతి కాదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. దర్యాప్తునకు ఆదేశిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై యావత్తు దేశం స్పందించింది. గర్భంతో ఉన్న మూగజీవాన్ని చంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కూడా అలాగే చంపాలంటూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

    కేరళలోని మల్లాపురంలోకి గర్భంతో ఉన్న ఏనుగు రావడంతో కొందరు ఆకతాయిలు దుర్మార్గంగా ఆలోచించి క్రాకర్లను ఓ పైనాపిల్‌లో కుక్కి నిప్పు పెట్టారు. దాన్ని ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్లు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు... ఆ పైనాపిల్‌ను నోట్లోకి తీసుకుంది. అంతే.. భారీ శబ్ధంతో పేలింది. ఏనుగు నోరు పూర్తిగా నాశనమైంది. నాలుక తీవ్రంగా దెబ్బతింది. అప్పటికే ఆ ఏనుగు పొట్టలో 18 నెలల గున్న ఏనుగు కూడా ఉంది. కాలిన నోటితో ఆ ఏనుగు కేకలు పెడుతూ... ఊరి సందుల్లో అటూ ఇటూ తిరిగింది. ఏదీ తినలేకపోయింది. గాయాల నొప్పి, బాధతో ఆ ఏనుగు చివరకు వెల్లియార్ నదిలోకి వెళ్లింది. అక్కడ నీరు తాగింది. ఆ తర్వాత నదిలోనే నిల్చొని చనిపోయింది.

    Published by:Shravan Kumar Bommakanti
    First published: