Home /News /crime /

Pandora papers: పన్ను ఎగవేతదారుల విషయంలో పండోరా పేపర్స్​ జాబితాపై కేంద్రం సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే

Pandora papers: పన్ను ఎగవేతదారుల విషయంలో పండోరా పేపర్స్​ జాబితాపై కేంద్రం సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాండోరా పేపర్స్ (pandora papers) ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పన్ను ఎగవేత కేసులపై దర్యాప్తు జరపనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) సోమవారం ప్రకటించింది. దీనిపై విచారణ పూర్తికాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంకా చదవండి ...
  ప్రపంచంలోని పలువురు పన్ను ఎగవేతదారుల (Tax evaders) జాతకాలను బయటపెట్టి ‘పండోరా పేపర్స్” పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పండోరా పేపర్స్ (pandora papers) ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పన్ను ఎగవేత కేసులపై దర్యాప్తు జరపనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) సోమవారం ప్రకటించింది. దీనిపై విచారణ (Enquiry) పూర్తికాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పన్ను ఎగవేతదారుల (Tax evaders) సమాచారం పొందడం కోసం విదేశాల్లో ఉన్న అధికార పరిధిని కూడా ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.

  లక్షల మంది ప్రముఖుల ఆర్థిక లావాదేవీ (Financial transactions)లను ‘పండోరా పేపర్స్” బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టు రట్టు చేస్తూ పండోరా పేపర్స్ (Panama papers) పేరుతో ఆదివారం రాత్రి వెలువరించింది. పలువురు ప్రముఖుల బాగోతాలను ప్రచురించింది. తక్కువ పన్ను (Tax) ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు ఇందులో పేర్కొంది. దేశ అధ్యక్షుల మొదలు బిలియనీర్లు, దౌత్యాధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ తారల వరకు.. 91 దేశాలకు చెందిన వేల మంది విదేశీ రహస్య ఆస్తులు, లావాదేవీ (Transactions)లకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను ఇంటర్నేషనల్‌ కన్సోర్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ICIJ) విడుదల చేసిన విషయం తెలిసిందే.

  సీబీడీటీ డైరెక్టర్ నేతృత్వంలో..

  ఆ పత్రాల్లో ఉన్న భారతీయులకు సంబంధించిన కేసులపై విస్తృత స్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వం (central government) నిర్ణయించింది. పండోరా పేపర్స్ (pandora papers)  ద్వారా వెలుగులోకి వచ్చిన పన్ను ఎగవేత కేసులపై దర్యాప్తు జరపనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు సీబీడీటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. సీబీడీటీ (CBDT), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ED), రిజర్వు బ్యాంక్, ఫైనాన్షియన్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు ఈ దర్యాప్తు బృందంలో భాగస్వాములు కానున్నారు. సీబీడీటీ డైరెక్టర్ (CBDT Director) బృందానికి నేతృత్వం వహిస్తారన్నారు. దీనిపై విచారణ పూర్తి కాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పన్ను ఎగవేతదారుల (Tax evaders) సమాచారం పొందడం కోసం విదేశాల్లో ఉన్న అధికార పరిధిని కూడా ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.

  పలువురు వ్యాపారవేత్తలతో సహా ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు (EX Mp), దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారు ఇలా అందరూ కలిపి 300 మందికి పైగా భారతీయులు పన్నుఎగవేత (Tax evaders )కు పాల్పడినట్లు ఈ పేపర్స్లో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రిటన్ (Britain) లోని ఓ కోర్టులో దివాలా తీసినట్లు ప్రకటించిన భారత్ లోని ప్రముఖ వ్యాపారవేత్త అనీల్ అంబానీ, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ, బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ సహా పలువురి పేర్లు పాండోరా పేపర్స్‌ (pandora papers) లో ఉన్నాయి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: BUSINESS NEWS, Central governmennt, Income tax

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు