ఖాకీ కక్కుర్తి...కోర్టు ఆధీనంలోని సెల్‌ఫోన్‌ చోరీ...ఉద్యోగం హుష్ కాకి.

సెల్‌ఫోన్‌ విషయంలో సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం టూటౌన్‌ సీఐ తుమ్మ గోపి దర్యాప్తు చేశారు. సెల్‌ఫోన్‌ను అప్పట్లో పనిచేసిన కానిస్టేబుల్‌ గుగులోత్‌ రాజు మాయం చేశాడని తేల్చారు. కోర్టు ఆదేశాలతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రిమాండుకు పంపారు.

news18-telugu
Updated: July 11, 2020, 2:57 PM IST
ఖాకీ కక్కుర్తి...కోర్టు ఆధీనంలోని సెల్‌ఫోన్‌ చోరీ...ఉద్యోగం హుష్ కాకి.
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్నది పెద్దల మాట. చిన్నచిన్న తప్పుడు పనులు చేసి.. ఆపై సాక్ష్యాలుగా ఉన్న వస్తువులను మాయం చేసి ఉద్యోగం పోగోట్టుకుని.. జైలు పాలైన ఇద్దరు ఉద్యోగుల ఉదంతం ఇది. ఒక పోలీసు, మరో కోర్టు ఉద్యోగి చేతులు కలిపారు. చేతులు కలిపారు అనేకంటే కక్కుర్తి పడ్డారు అనడం ఇక్కడ కరెక్ట్‌. ఎందుకంటే ఇద్దరూ కలిసి కొట్టేసింది సెల్‌ఫోన్‌ను. అదీ కోర్టులో సాక్ష్యం కోసం న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్‌ను. సాధారణంగా అయితే కోర్టులో ఓ కేసు నిమిత్తం ప్రవేశపెట్టిన సాక్ష్యాలను పోలీసులు భద్రపరచి, విచారణ సమయంలో మరలా ప్రవేశపెట్టాలి. ఆ సాక్ష్యాధారాలతోనే కేసును గెలిపించుకోవాలి. ఇక్కడ ఆ సెల్‌ఫోనే కీలకం అయిన విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా గతంలో పనిచేసిన గుగులోత్‌ రాజు సెల్‌ఫోన్‌ను మాయం చేశారు. తాజాగా సంబంధిత కేసు విచారణకు వచ్చింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారమైన సెల్‌ఫోన్‌ విషయంలో ఎప్పటికప్పుడు దాటవేత ధోరణిని న్యాయమూర్తి గమనించారు. ఆ సెల్‌ఫోన్‌ విషయంలో సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం టూటౌన్‌ సీఐ తుమ్మ గోపి దర్యాప్తు చేశారు. సెల్‌ఫోన్‌ను అప్పట్లో పనిచేసిన కానిస్టేబుల్‌ గుగులోత్‌ రాజు మాయం చేశాడని తేల్చారు. కోర్టు ఆదేశాలతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రిమాండుకు పంపారు. అయితే ఇక్కడో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ మాయం వెనుక కోర్టులో పనిచేసే ఓ కీలక ఉద్యోగి హస్తం ఉన్నట్టు వెలుగుచూసింది. అతన్ని కూడా ఆధారాలతో సహా అరెస్టు చేశారు.

అసలేం జరిగింది... 2018లో మణుగూరు కోర్టులో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ ఖలీల్‌ పాషా తనకు పెద్ద స్థాయి అధికారులు తెలుసని, ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అనేక మంది నిరుద్యోగుల వద్ద నుంచి భారీగా సొమ్ము వసూలు చేశాడు. ఎన్నాళ్లు గడచినా తమకు ఉద్యోగాలు రాకపోయేసరికి నిరుద్యోగులు నిలదీశారు. ఫలితం లేకపోయేసరికి బాధితులు ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖలీల్‌పాషా తమ వద్ద నుంచి ఎంత తీసుకున్నాడు.. ఏమేం చెప్పాడన్న విషయాలకు సాక్ష్యంగా అతనితో మాట్లాడినప్పుడు సెల్‌ఫోన్‌లో చేసిన రికార్డులను సమర్పించారు. ఈ చీటింగ్‌ కేసు గత రెండేళ్లుగా నడుస్తూ ఉంది. ఈ క్రమంలో కోర్టు ఉద్యోగి ఖలీల్‌పాషా తనకు పరిచయం ఉన్న కానిస్టేబుల్‌ గుగులోత్‌ రాజును మభ్యపెట్టి సెల్‌ఫోన్‌ తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో సదరు చీటింగ్‌ కేసు విచారణకు రావడం.. కేసులో కీలక సాక్ష్యమైన సెల్‌ఫోన్‌ను ప్రాసిక్యూషన్‌ తరపున ప్రవేశపెట్టడంలో పదేపదే పోలీసులు విఫలం చెందుతుండడంతో న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. దీంతో అసలు గుట్టు రట్టయింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రస్తుతం భద్రాచలం కోర్టులో పనిచేస్తున్న మహ్మద్‌ ఖలీల్‌పాషాను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అమాయకులను మోసం చేసి కోర్టుకు సాక్ష్యాలను అందకుండా చేయాలన్న ప్రయత్నాన్ని న్యాయమూర్తి చొరవ చెక్‌ పెట్టినట్లయింది.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading