భార్యపై సీక్రెట్ గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.. చివరకు అందులో రికార్డయిన దృశ్యాలను చూసిన భర్త..

Crime News: అతడు ఓ ఎన్నారై. భార్యపై నిఘా పెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. కానీ చివరకు అతడికే ఊహించని షాక్ తగిలింది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగానే బాధితురాలు తన భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీస్ కేసు పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Crime News: అతడు ఓ ఎన్నారై. భార్యపై నిఘా పెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. కానీ చివరకు అతడికే ఊహించని షాక్ తగిలింది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగానే బాధితురాలు తన భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీస్ కేసు పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  అతడు ఓ ఎన్నారై(NRI). భార్యపై నిఘా పెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాల(CC Camera)ను ఏర్పాటు చేశాడు. కానీ చివరకు అతడికే ఊహించని షాక్ తగిలింది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగానే బాధితురాలు తన భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీస్ కేసు పెట్టింది. ఈ ఘటటన గుజరాత్ లోని గంధీనగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్(Gandhi nagar) కు చెందిన ఓ మహిళకు అదే ప్రాంతానికి చెందిన భరత్ తో 2011 నవంబర్లో(November) వివాహం అయింది. మూడు సంవత్సరాల పాటు వాళ్ల సంసారం సాఫీగా సాగిపోయింది. తర్వాత ఆమె మూడేళ్ల తర్వాత అంటే 2014 లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

  Tea Rs.1,000: కప్పు టీ రూ.1,000.. అది కూడా తెలంగాణలో.. ఎందుకు అంత ధర..? తెలిస్తే మీరు వదలరూ..


  అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అది ఆమె తప్పు అన్నట్లు భర్త, అత్తమామలు వేధించడం మొదలు పెట్టారు. అమ్మాయి పుట్టడానికి గల కారణం ఆమెదే అన్నట్లు భర్త వేధించసాగాడు. అతడు చదువుకొని అమెరికాలో ఉంటున్నా.. అతడి బుద్ది మాత్రం నిరక్ష్యరాసుడిలాగే ఉంది. చదువకున్న వాళ్ల కంటే చదువు కోని వాళ్లే నయ్యం.. అన్నట్లు వ్యవహరించాడు. అమ్మాయి పుట్టడానికి కారణం తెలియని మూర్ఖుడిగా వ్యవహరించాడు. అతడితో పాటు ఆమె అత్తామామలు కూడా ఆమెను నిత్యం ఏదో ఒక కారణంతో  వేధింపులకు గురి చేస్తున్నారు.

  Chinese Biryani: చైనా బిర్యానీ ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వైరల్ వీడియో చూడండి..


  అతడు 2014 లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లి పోయాడు. తనను కూడా తీసుకెళ్లండి అంటూ అనడంతో అతడు ఆమెను  2015 సంవత్సరంలో తీసుకెళ్లాడు. ఆమెతో పాటు అతడి తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు. ఇక వాళ్లంతా అమెరికాలో చికాగోలో ఉండేవారు. అమెకు అక్కడ కూడా వేధింపులు మొదలయ్యాయి. అక్కడ కొత్త ఇల్లు కొనుక్కునేందుకు మరింత కట్నం తేవాలంటూ వారు ఆమెను వరకట్న వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఆమె కష్టాలతోనే తన సంసారాన్ని ఈడ్చుకుంటూ వచ్చింది. 2018 లో ఆమె తన అత్తమామలతో కలిసి ఇండియాకు వచ్చింది. అదే ఏడాది భర్త కూడా భారత్ కు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు.

  Success Story: పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురికి ఐఐటీలో సీటు.. వైరల్ అయిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ ట్వీట్..


  ఆమెపై రోజంతా నిఘా పెట్టేందుకు ఇంట్లో పలుచోట్ల సీసీ కెమెరాలను బిగించారు. ఆమెపై పలుమార్లు చేయి కూడా చేసుకున్నారు. ఇలా వాళ్లు ఆమె కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో ఆమెను కొట్టిన దృశ్యాలు రికార్డయ్యాయి. 2019లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా కూడా ఆమెకు ఇంట్లో వేధింపులు ఆగలేదు. తర్వాత మళ్లీ అతడు కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లిపోయాడు. ఇంకా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

  Viral Video: ఆ బాలుడు చేసే పని.. అందరికీ కన్నీళ్లు పెట్టించాయి.. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడు.. ఎందుకు..?


  ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ నే సాక్ష్యంగా పేర్కొంది. దీంతో అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. సీసీ కెమెరా ఫుటేజీతో భార్యను మరింత వేదిద్దామని భావించిన భర్త ప్లాన్ రివర్స్ అయ్యింది. అత్తామామల అరాచకం వెలుగులోకి వచ్చింది. ఇలా కోడలు ధైర్యం చేసి అత్తమామలు, భర్తపై కేసు పెట్టడంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యేళ్ల తరబడి చిత్రహింసలు అనుభవించిన ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన పైనా, అతడి తల్లిదండ్రులపై డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
  Published by:Veera Babu
  First published: