హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఫోన్‌కు వచ్చిన వీడియో చూసి షాక్ తిన్న దంపతులు.. మనీ కోసం బెదిరింపులు.. ఏకంగా 80 వీడియోలు.. ఆ పని చేసింది ఎవరంటే..?

ఫోన్‌కు వచ్చిన వీడియో చూసి షాక్ తిన్న దంపతులు.. మనీ కోసం బెదిరింపులు.. ఏకంగా 80 వీడియోలు.. ఆ పని చేసింది ఎవరంటే..?

ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌కు వచ్చిన వీడియోలు చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అది తన భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజ్.

ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌కు వచ్చిన వీడియోలు చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అది తన భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజ్.

ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌కు వచ్చిన వీడియోలు చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అది తన భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజ్.

  ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌కు వచ్చిన వీడియోలు చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అది తన భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజ్. అయితే ఈ వీడియోలు పంపిన వ్యక్తి.. తను అడిగనట్టుగా డబ్బులు ఇవ్వకపోతే, వాటిని పోర్న్ సైటులో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. కరణ్ అహుజ అనే వ్యక్తి దక్షిణ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. అతడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, అతని భార్య ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కరణ్, అతని భార్య.. తమ బిడ్డ బాధ్యతలు చూసుకునేందుకు ఓ ఆయాను నియమించుకున్నారు. అలాగే ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని నెలల తర్వాత సీసీటీవీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో కరణ్.. టెక్నిషియన్‌ను సీసీటీవీ కెమెరాల రిపేర్ కోసం పిలిచాడు.

  ఇక, సీసీటీవీ కెమెరాల రిపేర్ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. అందులో రికార్డు అయిన కొన్ని దృశ్యాలను గమనించాడు. వాటిలో కరణ్, అతని భార్యతో సన్నిహితంగా గడిపిన దృశ్యాలు కూడా ఉన్నాయి. వీటిని టెక్నిషీయన్.. కరణ్‌కు అనుమానం రాకండా తన ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకన్నాడు.

  ఇది జరిగిన కొన్ని నెలలకు కరణ్ ఫోన్‌కు ఓ వీడియో వచ్చింది. అది కరణ్‌, తన భార్యతో సన్నిహితంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్. ఇది చూసిన కరణ్ షాక్ తిన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. ఓ వ్యక్తి కాల్ చేసి తనకు డబ్బులు చెల్లించకుంటే.. ఈ వీడియోలను పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపుకలకు పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన కరణ్.. అతను అడిగిన డబ్బులను వెంటనే ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే అతడు మరోసారి కరణ్‌కు ఫోన్ చేసి.. మరిన్ని డబ్బులు అడిగాడు. మూడు లక్షల రూపాయలకు పైగా డబ్బులు డిమాండ్ చేశాడు.

  దీంతో కరణ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక సహాయంతో పోలీసులు ఈ పని చేసిన సీసీటీవీ టెక్నిషియన్‌ను పట్టుకున్నాడు. అతడిని రషీద్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని Azamgarhకు చెందిన రషీద్.. ఢిల్లీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడు కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తన వద్ద ఉన్న వీడియోలతో కరణ్ దంపతులను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక, రషీద్ ఫోన్‌లో పోలీసులు కరణ్ దంపతులకు చెందిన 80 objectionable clipsను గుర్తించారు.

  First published:

  Tags: Blackmail, Cctv, Crime news, Delhi

  ఉత్తమ కథలు