హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: వామ్మో ..2వేల రూపాయల కోసం వాళ్లు అంత పని చేశారా

OMG: వామ్మో ..2వేల రూపాయల కోసం వాళ్లు అంత పని చేశారా

Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG: హర్యానాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తుపాకీ, గొడ్డలి పట్టుకొని ఓ షాపుకు వచ్చిన కిరాతకులు యజమానిని బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తు పట్టే పనిలో ఉన్నారు పోలీసులు. త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఇంకా చదవండి ...

హర్యానా(Haryana)లో తెల్లవారిందో లేదో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఓ కిరాణ షాపు తెరవగానే యజమాని దగ్గరకు వెళ్లి క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు తీసివ్వమని బెదిరించారు. వచ్చిన వాళ్లు తమను ఎవరూ గుర్తు పట్టకుండా, ముఖాలు కనిపించకుండా తలను షాలువాలతో కప్పుకొని వచ్చారు. ఉట్టిగా వచ్చి బెదిరిస్తే డబ్బులు ఎవరూ ఇవ్వరు..తమను చూసి భయపడనకురున్నారో ఏమో ఒకడు తుపాకి (Gun), మరొకడు గొడ్డలి(Knife)పట్టుకొని కిరాణాషాపును రాబరీ చేయడానికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 6గంటల సమయంలో ఈ  దోపిడీ జరిగింది. హర్యానా రాష్ట్రం గోహనా (Gohana)రోహ్‌తక్‌ (Rohtak road)రోడ్డులో ఉన్న ఓ చిన్న కిరాణా షాపులో ఈ దోపిడీ జరిగింది. కిరాణ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఇద్దరు దుండగులు వచ్చి యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసుకెళ్లిన దృశ్యాలు పూర్తిగా రికార్డయ్యాయి. క్యాష్‌ కౌంటర్‌లో డబ్బులు లేవని  వ్యాపారి తన చేతిలోని  క్యాష్ బ్యాగు చూపించే ప్రయత్నం (Trader) చేస్తుండానే మరో వ్యక్తి యజమానిపై దాడి చేశాడు. డబ్బులు ఇవ్వపోతే ప్రాణాలు తీయాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. చేతుల్లో ఆయుధాలు ఉండటంతో షాపు యజమాని భయపడి కుర్చిలో కూర్చుండిపోయాడు. ఇంతలో దోపిడీ చేయడానికి వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు క్యాష్ కౌంటర్‌లో చేయి పెట్టి అందులో ఉన్న రెండున్నర వేల నగదును తీసుకొని తన షర్ట్ జేబులో పెట్టుకున్నాడు. షాపు ఓనర్‌ దగ్గర డబ్బులు లేవని అర్ధం చేసుకున్నారు దొంగలు. ఎవరైనా వస్తారేమోనన్న భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.

వ్యాపారి తలపై తుపాకి గురి పెట్టి..

ఉదయాన్నే దోపిడీ దొంగలు ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకున్న కిరాణషాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు యజమానికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. షాపులో ఉన్న సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు. దొంగలు నడిచే వచ్చారని..వాళ్లు కేవలం డబ్బుల కోసం వచ్చిన చిల్లర దొంగలని గొహానా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌తో పాటు చుక్కు పక్కల ప్రదేశాల్లో కెమెరాలను పరిశీలిస్తామని నిందితుల్ని కచ్చితంగా గుర్తించి పట్టుకుంటామని తెలిపారు.


పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..

దొరికిన వరకూ డబ్బులు తీసుకున్న దోపిడీ దొంగలు షాపు యజమానిని చంపడానికి సాహసించలేదు. తెల్లవారుజాము కావడంతో షాపుకి ఎవరైనా వస్తే గుర్తుపడతారని తమను పోలీసులకు పట్టిస్తారేమోనన్న భయంతోనే ఏం చేయకుండా వెళ్లారని షాపు యజమాని తెలిపాడు. ఇలాంటి దోపిడి దొంగలతో తమకు ముప్పు కలగకుండా పోలీస్ పెట్రోలింగ్‌ ఏర్పాటు చేయాలని...తనపై దాడికి ప్రయత్నించిన వాళ్లను పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. దోపిడీ చేసి తప్పించకుండా తిరుగుతున్న ఇద్దరు దొంగల కోసం పోలీసులు వెదుకుతున్నారు.

First published:

Tags: Haryana, Robbery, Viral Video

ఉత్తమ కథలు