Home /News /crime /

Viral: అయ్యో పాపం.. ఎవరు ఈవిడ.. నడిరోడ్డుపై తలపట్టుకుని ఇంతలా ఏడుస్తోంది ఎందుకో తెలిస్తే..

Viral: అయ్యో పాపం.. ఎవరు ఈవిడ.. నడిరోడ్డుపై తలపట్టుకుని ఇంతలా ఏడుస్తోంది ఎందుకో తెలిస్తే..

వీడియోలోని దృశ్యం

వీడియోలోని దృశ్యం

పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలనే టార్గెట్ చేస్తూ బైక్‌పై వెనుక నుంచి వచ్చి మెడలో చైన్లు, చేతికి ఉన్న హ్యాండ్ బ్యాగులు లాక్కుని పారిపోతున్నారు.

    పాండిచ్చేరి: పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలనే టార్గెట్ చేస్తూ బైక్‌పై వెనుక నుంచి వచ్చి మెడలో చైన్లు, చేతికి ఉన్న హ్యాండ్ బ్యాగులు లాక్కుని పారిపోతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా.. పాండిచ్చేరిలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నైవేలి ప్రాంతంలో పుదుచ్చేరి-విల్లుపురం జాతీయ రహదారిపై ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళుతున్నారు.

    సొంతూరికి వెళ్లేందుకు బస్ కోసం బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతున్న ఆ మహిళల్లో ఒకరు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉండటాన్ని చైన్ స్నాచర్లు పసిగట్టారు. ఎప్పుడు వారిని గమనించారో, ఏమో తెలియదు గానీ వెనుక నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న మహిళకు సమీపంలో బైక్ పోనిచ్చి వెనుక ఉన్న వ్యక్తి ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను కొట్టేశాడు. వెంటనే అక్కడి నుంచి బైక్‌పై ఇద్దరూ పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

    సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ దారి దోపిడితో బాధిత మహిళకు ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పారిపోతున్నారని కేకలేసింది. అయితే.. బైక్‌పై వెళుతున్న ఆ దొంగ బ్యాచ్ అప్పటికే ఉడాయించారు. దీంతో.. ఆ మహిళ తీవ్ర ఆవేదనతో నడిరోడ్డుపై భోరున విలపించింది. ఏడ్చుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ రోడ్డుపై అలా ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు ‘అయ్యో పాపం’ అని జాలిగా నిట్టూర్చారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chain snatching, Crime news, Tamilnadu, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు