హోమ్ /వార్తలు /క్రైమ్ /

Video: బ్యాగులో బాంబుతో దర్జాగా...సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన మానవబాంబు...

Video: బ్యాగులో బాంబుతో దర్జాగా...సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన మానవబాంబు...

బ్యాగుతో చర్చిలోకి ప్రవేశిస్తున్న మానవ బాంబు (CCTV Footage)

బ్యాగుతో చర్చిలోకి ప్రవేశిస్తున్న మానవ బాంబు (CCTV Footage)

మానవబాంబుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి బ్యాగు వేసుకొని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ప్రవేశించడాన్ని అక్కడి సీసీ కెమెరాలు రికార్డు చేయగా, దీనికి సంబంధించిన ఫుటేజీ విడుదల చేశారు. నిందితుడు నింపాదిగా బ్యాగు తగిలించుకొని చర్చిలోకి ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

    శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్లలో మొత్తం 321 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన వెనుక ఐసీస్ ప్రమేయం ఉందని మొదటి నుంచి శ్రీలంక భద్రతాధికారులు అనుమానం వ్యక్తం చేయగా, ఆ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఐసీస్ సంస్థ తాజాగా పేర్కొంది. అయితే మానవబాంబు తో  ఈ నరమేధానికి పాల్పడ్డారని తెలిపే కీలక ఆధారాలు దొరికాయి. మానవబాంబుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి బ్యాగు వేసుకొని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ప్రవేశించడాన్ని అక్కడి సీసీ కెమెరాలు రికార్డు చేయగా, దీనికి సంబంధించిన ఫుటేజీ విడుదల చేశారు. నిందితుడు నింపాదిగా బ్యాగు తగిలించుకొని చర్చిలోకి ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


    First published:

    Tags: Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు