హోమ్ /వార్తలు /క్రైమ్ /

మెట్రో స్టేషన్‌లో ఆ పని.. అది కాస్త పోర్న్‌సైట్‌లోకి..

మెట్రో స్టేషన్‌లో ఆ పని.. అది కాస్త పోర్న్‌సైట్‌లోకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జులై 18వ తేదీ మధ్యాహ్నాం 2.22గంటలకు ఆ వీడియో రికార్డయినట్టు సీసీటీవీలో కనిపించింది. సీసీటీవీ ఫుటేజీని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో.. ఇప్పటికే లక్ష మంది దాన్ని వీక్షించినట్టుగా గుర్తించారు.

అది ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్.. అదో పబ్లిక్ ప్లేస్ అన్న సంగతి మరిచిపోయి.. ఓ జంట ముద్దుల్లో మునిగిపోయింది. అక్కడితో ఆగక ఇంకాస్త ముందుకెళ్లింది.అయితే ఇవేవీ ఎవరి కంటపడలేదు. కానీ సీసీటీవీలో మాత్రం రికార్డయ్యాయి. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలను ఎవరో సెల్‌ఫోన్‌లో బంధించి పోర్న్ సైట్‌లోకి అప్‌లోడ్ చేశారు. రైల్వే స్టేషన్‌లో అలాంటి పనులు చేయడం తప్పే అయినప్పటికీ.. సీసీటీవి ఫుటేజీ నుంచి ఆ దృశ్యాలను ఎవరు లీక్ చేశారు..? పోర్న్ సైట్‌లోకి ఎవరు అప్‌లోడ్ చేశారు? అన్న ప్రశ్నలు ఢిల్లీ మెట్రో అధికారులను ఇరకాటంలో పడేశాయి.

జులై 18వ తేదీ మధ్యాహ్నాం 2.22గంటలకు ఆ వీడియో రికార్డయినట్టు సీసీటీవీలో కనిపించింది. సీసీటీవీ ఫుటేజీని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో.. ఇప్పటికే లక్ష మంది దాన్ని వీక్షించినట్టుగా గుర్తించారు. ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(DMRC) అధికారులు అజాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేయవద్దని ఆయన ప్రయాణికులకు సూచించారు. అయితే ఢిల్లీ మెట్రో సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి ఫుటేజీ ఎలా లీకైందన్న దానిపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి ఫుటేజీ డేటా చోరీ అవడం అంటే ప్రజల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Delhi, Delhi metro

ఉత్తమ కథలు