• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CC CAMERAS CAUGHT A LADY OFFICER BRIBAING FROM A BUSINESSMEN IN SRIKAKULAM DISTRICT NGS

మహిళా అవినీతి అధికారిని పట్టించిన సిసి కెమెరాలు

మహిళా అవినీతి అధికారిని పట్టించిన సిసి కెమెరాలు

ఏపీలో ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారుల అవినీతి లీలలు బయటపడ్డాయి. అయితే శ్రీకాకుళంలో లంచం తీసుకున్న అధికారిని సీసీ కెమెరాలే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాయి..

ఏపీలో ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారుల అవినీతి లీలలు బయటపడ్డాయి. అయితే శ్రీకాకుళంలో లంచం తీసుకున్న అధికారిని సీసీ కెమెరాలే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాయి..

  • Share this:
    పురుషులతో అన్నింటిలో సమానం అని  మహిళలు పోటీ పడుతూ గెలుస్తున్నారు.. అయితే ఏపీలో కొంతమంది మహిళా అధికారులు లంచలాల్లోనూ మేం సమానమే అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో హ్యాపీగా సరిపెట్టుకోక.. చేతులు తడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల చాలామంది మహిళా అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు.. తాజాగా ఏపీలో ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారుల అవినీతి భాగోతాలు బయటపడ్డాయి.

    శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళా అధికారిని సీసీ టీవీ కెమెరాలు పట్టించాయి. కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో ఈ అవినీతి సంఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిశ్రమల తనిఖీ కార్యాలయంలో కుసుమ కుమారి అనే ఆమె సీనియర్ అసిస్టెంటట్ గా దాదాపు 18 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. భారీగా జీతం వస్తున్నా.. ఆ సంపాదన సరిపోవడం లేదనుకున్న ఆమె లంచాలకు అలవాటు పడ్డారు. ఇటీవల ఓ కర్మాగారం తనిఖీల ధ్రువప్రత్రం కోసం అనుమతి ఇచ్చేందుకు.. ఓ యజమాని దగ్గర లంచం డిమాండ్ చేశారు..

    ఆమె అడిగిన లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వచ్చిన అతడు నేరుగా ఆమె చేతికి నగదు అందించాడు. అయితే కార్యాలయంలో సీసీ కెమెరాలు పని చేయడం లేదనుకున్నారు కుసుమ కుమారి. లంచం తీసుకున్న డబ్బును నేరుగా సీసీ కెమెరాలకే చూపిస్తూ కాసేపు చిలిపి చేష్టలు చేశారు.. అయితే సీసీ కెమెరాలు పనిచేయడం లేదనుకుంటే.. ఆ కెమెరాలే ఆమెను పట్టించాయి.

    కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు తెలుసుకోవడానికి సిసి ఫుటేజ్ ను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ డి.చంద్రశేఖర వర్మ పరిశీలించారు. అప్పుడు సిసి ఫుటేజ్ లో రికార్డైన లంచం దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. తాను లంచం తీసుకున్నానన్న సంగతి మూడో కంటికి తెలీదనుకుంటే.. ఇలా సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆమె షాక్ కు గురయ్యారు. ఆమె బాగోతం బయటపడడంతో వెంటనే సస్పెండ్ చేశారు ఛంద్రశేఖర్ వర్మ.

    మరోవైపు కృష్ణాజిల్లాలో ఏసీబీకి రెడ్ హ్యాండెండ్ గా దొరికారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలసాని శేష కుమారి.
    ఎ.కొండూరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ధరావతు ఏసు నాయక్, ధరావతు రంగ దగ్గర లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు బాలసాని కుమారి. ఫారెస్ట్ సంబంధించిన నాలుగు ఎకరాల పొలానికి R.O.F.R పట్టాల కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అయితే బాధితులు అంత ఇచ్చుకోలేమని చెప్పడం 50 వేల రూపాయలు తీసుకోడానికి శేష కుమారి అంగీకరించారు.
    తరువాత బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. నిఘా వేసి శేషకుమారిని రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు