వివేకా హత్య కేసులో సీబీఐ ‘సీన్ రీ-కన్స్‌ట్రక్షన్’

YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసు విచారణ చేపట్టిన సీబీఐ ఈ కేసుకు సంబంధించి సీన్ రీ-కన్స్‌ట్రక్షన్ చేపట్టింది.

news18-telugu
Updated: July 24, 2020, 7:20 PM IST
వివేకా హత్య కేసులో సీబీఐ ‘సీన్ రీ-కన్స్‌ట్రక్షన్’
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
  • Share this:
సీఎం వైఎస్ జగన్ బాబాయ్, వైసీపీ నేత వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగైదు రోజుల పాటు పులివెందులలోనే ఉంటూ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు... తాజాగా ఈ కేసుకు సంబంధించి సీన్ రీ-కన్స్‌ట్రక్షన్ చేపట్టినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే అంశంపై వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న, డ్రైవర్ ప్రసాద్, ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డితో కలిసి సీబీఐ అధికారులు సీన్ రీ-కన్స్‌ట్రక్షన్ చేపట్టినట్టు సమాచారం. అంతకుముందే వాచ్‌మెన్ రంగన్న నుంచి పలు వివరాలు సేకరించిన సీబీఐ అధికారులు... ఆ తరువాత మరో ముగ్గురితో కలిసి ఈ ప్రక్రియ చేపట్టారు.

మరికొందరు సీబీఐ అధికారులు ఇందుకోసం పులివెందుల చేరుకున్నారు. అంతకుముందు ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న కొందరిని స్టేట్‌మెంట్స్‌ను సీబీఐ అధికారులు మరోసారి రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె ఆరోపిస్తున్న 15 మంది స్టేట్‌మెంట్స్‌పై సీబీఐ దృష్టి సారించింది. ఇప్పటికే వివేకా హత్య జరిగిన భవనం కొలతలు కూడా తీసుకున్న సీబీఐ... ఈ కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో చేపట్టినట్టు తెలుస్తోంది.



2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇంట్లోనే ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు, ఇతర గాయాలు కనిపించాయి. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డికి బాబాయి, స్వయానా మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఐతే సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే అధికారంలోకి వచ్చాక హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

అయితే సీబీఐ విచారణ చేయాలని వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. హత్య కేసుగా నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరు టీడీపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపితే తమను అన్యాయంగా ఇరికించే అవకాశం ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు వివేకా కుటుంబ సభ్యులను అడిగి కేసుపై వివరాలను తెలుసుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 24, 2020, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading