డాక్టర్ సుధాకర్‌పై కేసు.. షాకిచ్చిన సీబీఐ..

డాక్టర్ సుధాకర్ పైనా సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

news18-telugu
Updated: June 3, 2020, 6:43 AM IST
డాక్టర్ సుధాకర్‌పై కేసు.. షాకిచ్చిన సీబీఐ..
డాక్టర్ సుధాకర్ పై కేసు సీబీఐ నమోదు (File)
  • Share this:
డాక్టర్ సుధాకర్ వివాదం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. హైకోర్టు ఆదేశంతో సుధాకర్‌ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు అంతకుముందు పోలీసులపై కేసు నమోదు చేయగా, తాజాగా.. డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా మాట తూలడం, ఓ కానిస్టేబుల్ మొబైల్‌ను కిందపడేయడం, తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారని సీబీఐ ఆరోపిస్తూ కేసు పెట్టింది. 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు. దీంతో వాటిని పరిశీలించి అతడిపై కేసు పెట్టారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్‌పై సెక్షన్ 188 నమోదైంది.

కాగా, విచారణను ప్రారంభించిన వెంటనే సీబీఐ.. విశాఖలో కొందరు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. వీటిలో కుట్ర కోణం, కావాలని తిట్టడం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదిరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి. దీంతో కేసు మలుపులు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
First published: June 3, 2020, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading