Home /News /crime /

CBI FILED CHARGE SHEET IN YS VIVEKANANDA REDDY MURDER CASE FULL DETAILS HERE PRN

YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో సీబీఐ ఛార్జ్ షీట్.. ఈ నలుగురే నిందితులు..

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI) పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలు కీలక అంశాలను పేర్కొంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు నలుగురు కారణమని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వీరిలో ఏ-1గా ఎర్రం గంగిరెడ్డి, ఏ-2గా సునీల్ యాదవ్, ఏ-3 ఉమాశంకర్ రెడ్డి, ఏ-4గా వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని నిందితులుగా పేర్కొంది. మొత్తం 650 పేజీల ఛార్జ్ షీటును పులివెందుల కోర్టులో దాఖలు చేశారు. దాదాపు 250 మందిని విచారించగా ఈ నలుగురు నిందితులుగా తేలిందన్నారు.

    ఇది ప్రైమరీ ఛార్జ్ షీటు కాగా.. మరోసారి పూర్తి సమాచారంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇంకా మరికొందరి పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. నలుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరు కడప జైలులో ఉండగా మరో ఇద్దరు బెయిల్ పై ఉన్నారు. మరోవైపు వైఎస్ వివేక కుమార్తె సునీత.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీటును తమకు ఇవ్వాలని కోర్టులో పిటషన్ వేయగా.. న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

    ఇది చదవండి: క్రిస్టియన్ కు టీటీడీలో సభ్యత్వం..? వైసీపీ ఎమ్మెల్యే మతంపై వివాదం.. ఆయన ఏమన్నారంటే..!


    ఇదిలా ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మార్చి నెలలో కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే వైఎస్ వివేకా దారుణహత్యకు గురయ్యారు. ఆయన్ను గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. తొలుత ఆయన గుండెపోటుతో మృతి చెందారని ప్రచారం జరిగినా ఆ తర్వాత హత్యగా తేల్చారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ తో దర్యాప్తు చేయగా.. ఆ తర్వాత విచారణ సీబీఐకి వెళ్లింది. కేసును సీరియస్ గా తీసుకున్న సీబీఐ అన్ని కోణాల్లోనూ విచారించింది. కేసు దర్యాప్తు చేసిన పులివెందుల పోలీసులు, ఇంట్లో పనివాళ్లు, సన్నిహితులు, బంధువులు, డ్రైవర్లు ఇలా 250మందికి పైగా అనుమానితులు, సాక్షులను సీబీఐ విచారించింది.

    ఇది చదవండి: గంజాయిపై పవన్ ట్వీట్ల వర్షం... వీడియోలతో సహా జగన్ సర్కార్ పై ఎటాక్...


    ఈ క్రమంలో ఎర్రం గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ హత్యకు కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన తర్వాత వాచ్ మెన్ రంగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాతే కేసు దర్యాప్తు వేగంగా సాగింది. ఈ కేసులో వైసీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలను కూడా సీబీఐ విచారించింది. మొత్తానికి ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో విచారణ కొలిక్కి వచ్చింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, CBI, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు