500 రూపాయల లంచంపై సీబీఐ దర్యాప్తు...యూపీలో సంచలనం...

పోస్టల్ సబ్ ఆపీసులో జమ చేసే సమయంలో ప్రతి ఇరవై వేలకు, వంద రూపాయలు లంచంగా ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ సరోజ్, పోస్టల్​ అసిస్టెంట్ సూరజ్​ మిశ్రా డిమాండ్ చేశారు. దీంతో ఆ పోస్టల్ ఏజెంట్ సీబీఐని ఆశ్రయించింది.

news18-telugu
Updated: December 2, 2019, 10:38 PM IST
500 రూపాయల లంచంపై సీబీఐ దర్యాప్తు...యూపీలో సంచలనం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నో లక్షల కోట్ల కుంభకోణాలను వెలికి తీసి, దోషులను కటకటాల వెనక్కు నెట్టిన సీబీఐ, ప్రస్తుతం ఓ మరో కుంభకోణం దర్యాప్తును చేపట్టింది. అయితే కుంభకోణం విలువ ఎంతో తెలిస్తే షాక్ తింటారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పోస్టల్ అసిస్టెంట్ రూ.500 లంచం తీసుకున్న కేసులో దర్యాప్తు ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్​ప్రదేశ్‌లోని ప్రతాప్​గఢ్​ జిల్లా కుందా ప్రాంతానికి చెందిన మహిళ పోస్టల్ ఏజెంట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమె ప్రజల నుంచి సేకరించిన సొమ్మును..పోస్టల్ సబ్ ఆపీసులో జమ చేసే సమయంలో ప్రతి ఇరవై వేలకు, వంద రూపాయలు లంచంగా ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ సరోజ్, పోస్టల్​ అసిస్టెంట్ సూరజ్​ మిశ్రా డిమాండ్ చేశారు. దీంతో ఆ పోస్టల్ ఏజెంట్ సీబీఐని ఆశ్రయించింది. అయితే రూ.500 లంచం తీసుకున్న ఆధారాలను సీబీఐ దర్యాప్తు అధికారులకు సమర్పించారు. అడిగిన సొమ్ము ఇవ్వకుండా, పనులను జాప్యం చేస్తున్నారంటూ మహిళ ఫిర్యాదులో పేర్కుంది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సదరు అధికారులపై కేసు బుక్ చేసింది.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...