Home /News /crime /

CBI ARRESTS A MAN IN SRINAGAR WHO RUNNING ONLINE CHILD SEXUAL ABOUSE RACKET TARGETING MINORS LIVING IN AMERICA NK

Sex Racket: ఆన్‌లైన్ సెక్స్ రాకెట్... అమెరికా యువతే టార్గెట్... యువకుడి అరెస్టు

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్... అమెరికా యువతే టార్గెట్... యువకుడి అరెస్టు (ప్రతీకాత్మక చిత్రం)

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్... అమెరికా యువతే టార్గెట్... యువకుడి అరెస్టు (ప్రతీకాత్మక చిత్రం)

Online Sex Racket: ఈ మధ్య పనికిమాలిన వాళ్లు సమాజంలో ఎక్కువ అవుతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ కేడీ ఏం చేశాడో తెలిస్తే కొద్దిగా షాక్ అవుతారు.

  Online Sex Racket in Srinagar: ఈ మధ్య మైనర్లు, పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు బాగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే... ఏకంగా దుకాణాలే తెరుస్తున్నారు. ఇది మన దేశంలోనేకాదు.. ప్రపంచమంతా కరోనా కంటే వేగంగా విస్తరించిన జబ్బు. కరోనా తగ్గుతున్నా... ఇది తగ్గట్లేదు. శ్రీనగర్‌లో ఓ పనికిమాలిన వాడు ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని ఇంటర్నెట్‌లో బాగా వెతికాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనిపించే చాలా సైట్లు వెతికాడు. అన్నీ మోసపూరితమైనవే అనుకున్నాడు. ఆ క్రమంలో... పోర్న్ సైట్లవైపు చూశాడు. అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి పోర్నోగ్రఫీ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అంతే తెల్లారేసరికి ఆన్‌లైన్ దుకాణం ప్రారంభించాడు.

  ఇదీ చేసిన దుర్మార్గం:
  ఆన్‌లైన్‌లో సెక్స్ ఫొటోలు, వీడియోలూ అమ్ముకునేవాళ్లను కలిశాడు. వాళ్లతో చిన్న చిన్న డీల్స్ కుదుర్చుకున్నాడు. ఏంటంటే... వాళ్లు చిన్న పిల్లలపై చేసే లైంగిక వేధింపుల ఫొటోలు, వీడియోలూ వాళ్ల దగ్గర నుంచి కొనసాగాడు. అలాగే... తాను కూడా శ్రీనగర్ అంతా తిరుగుతూ... రోడ్లపై ఎక్కడైనా ఒంటరిగా వెళ్లే పిల్లలపై లైంగిక దాడులు చేస్తూ... వాటిని వీడియోలు తీశాడు. అవన్నీ కలిపి... ఓ సెక్స్ రాకెట్ వైబ్‌సైట్ తెరిచాడు. ఆ సైట్‌లో ఈ వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేశాడు. రోడ్డున పోయే పిల్లలకు డబ్బు ఆశ చూపి... వాళ్లను నగ్నంగా వీడియోలు తీసి... అవన్నీ అప్‌లోడ్ చేస్తున్నాడు. వాటిని అమెరికాలోని యువత, పిల్లలు చూసేలా చేస్తున్నాడు. తద్వారా వారి నుంచి డబ్బు రాబట్టేందకు ట్రై చేస్తున్నాడు.

  సీబీఐ ఆరెస్టు:
  ఎలా తెలిసిందో గానీ... ఈ దుర్మార్గం బయటపడింది. వెంటనే పోలీసులు కాకుండా సీబీఐ రంగంలోకి దిగడం విశేషం. ఓ ఇంటిపై దాడి చేసిన సీబీఐ అధికారులు... ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే... కొన్ని పెన్‌డ్రైవ్‌లు, సీడీలు, ల్యాప్‌టాప్‌లు సీజ్ చేశారు. చేతితో రాసన ఓ నోట్ కూడా దొరికింది. ఇతను ఏంత మందితో డీల్ నడుపుతున్నాడో... వాళ్లందర్నీ పట్టుకుంటామని అధికారులు తెలిపారు.


  పిల్లలే ఎందుకు?
  జనరల్‌గా సెక్స్ రాకెట్ నడిపేవారు యువతులు, మహిళలను రంగంలోకి దింపుతారు. కానీ శ్రీనగర్‌లో వ్యక్తి పిల్లలను వీడియో తీస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని అంటే... పిల్లలైతే... జరిగింది తమ తల్లిదండ్రులకు సరిగా చెప్పలేరనీ, మర్చిపోతారనీ ఇలా చేస్తున్నట్లు చెప్పాడు. ఎంత కన్నింగ్ మైండో చూడండి. మరి అమెరికాలో పిల్లలను ఎలా టార్గెట్ చేస్తున్నారని అడిగితే... అమెరికాలో పిల్లలకు వీడియో కాల్స్ చేస్తాడట. ఆ తర్వాత వాళ్లకు ఇలాంటి బూతు వీడియోలు చూపించి... తమవైపు తిప్పుకుంటున్నట్లు చెప్పాడు. కన్నింగ్ బుర్రలో అన్నీ దరిద్రపు ఆలోచనలే.

  ఇది కూడా చదవండి:Horoscope Today: డిసెంబర్ 23 రాశి ఫలాలు... ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయం

  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పోర్నోగ్రఫీ సైట్లను మూసేసింది. కానీ చాలా దేశాల్లో ఈ బ్లూ ప్రపంచం అమల్లో ఉంది. అక్కడ పోర్న్ మూవీలో నటించడం నేరం కాదు. అందువల్ల ఆయా దేశాల్లో ఇలాంటి బూతు వీడియోలు, ఫొటోలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని... ఇలాంటి దుర్మార్గులు అరాచకాలకు పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ లాగా... ఇలాంటి ఫుటేజ్ కూడా ఇంటర్నెట్ ద్వారా ఈజీగా దేశాల సరిహద్దులు దాటేస్తోంది. అందువల్లే ఇలాంటి వాళ్లు ఈ బిజినెస్ చేస్తూ... సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Sex Racket, Srinagar

  తదుపరి వార్తలు