Shocking: వామ్మో.. ఏందది.. వీడియో చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది.. అస్సలు మీరు మనుషులేనా..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: గత కొన్నాళ్ల నుంచి యువతితో ఓ దళిత యువకుడు ప్రేమవ్యవహారం నడిపిస్తున్నాడని.. రాజస్థాన్ లో హ‌నుమాన్‌ఘ‌ఢ్‌ కు చెందిన కొందరు అతడి అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 • Share this:
  గత కొన్నాళ్ల నుంచి యువతితో జగదీశ్ అనే ఓ దళిత యువకుడు ప్రేమవ్యవహారం నడిపిస్తున్నాడని.. ఆ ద‌ళిత యువ‌కుడిని కొంద‌రు కొట్టిచంపేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్ధాన్‌లోని హ‌నుమాన్‌ఘ‌ఢ్‌లో వెలుగుచూసింది. యువ‌కుడిపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంటి నుంచి వెళ్లిన యువకుడు రాత్రి విగతజీవిగా కనిపించాడు. దీంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడిని తీవ్రంగా కొడుతున్న దృశ్యాల‌తో కూడిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేంత‌వ‌ర‌కూ అత‌డు ఎలా చ‌నిపోయాడ‌నేది కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌రాలేదు. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఓ పశువును బాదుతున్నట్లు బాదారు.

  B.Tech Student: చదువుకొమ్మని తల్లిదండ్రులు కాలేజీకి పింపిస్తే.. అతడు చేసిన నిర్వాకం ఇది.. టీచర్లను కూడా వదలకుండా..

  అక్కడే కొంతమంది ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ కనిపించారు. బాధితుడి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా 11 మందిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందితులంద‌రినీ అరెస్ట్ చేసే వ‌ర‌కూ ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిర‌స‌న‌ల‌కు దిగారు. ఈ వీడియో చూసని నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఉరి తీయాలని.. తప్పుచేస్తే పోలీసులకు అప్పగించాలి కానీ.. ఇలా విచక్షణారహితంగా దాడి చేయడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముకేశ్, ఓం ప్రకాష్ మరియు హంసరాజ్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు పిలిబంగా ఎస్‌హెచ్‌ఓ ఇందర్ కుమార్ తెలిపారు.

  ఆమె నిద్రలేచి చూసే సరికి తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయం తెలియలేదు.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..


  ఎస్‌డిఎమ్ రంజీత్ కుమార్ శనివారం బాధిత కుటుంబ సభ్యులను కలుసుకుని మృతదేహాన్ని దహనం చేసేందుకు ఒప్పించారు. ఈ వీడియోను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మౌనం పాటించడంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు.
  Published by:Veera Babu
  First published: