జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్..

జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్న యువతులను వ్యభిచార ఊబిలోకి దించాడో డైరెక్టర్. వారితో పడుపు వృత్తి చేయిస్తూ పబ్బం గడుపుకోవాలని చూసి, కటకటాల పాలయ్యాడు.

news18-telugu
Updated: January 16, 2020, 10:46 AM IST
జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్న యువతులను వ్యభిచార ఊబిలోకి దించాడో డైరెక్టర్. వారితో పడుపు వృత్తి చేయిస్తూ పబ్బం గడుపుకోవాలని చూసి, కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నవీన్ ప్రేమ్‌లాల్ ఆర్య(32) అనే వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ గత కొన్ని నెలలుగా సెక్స్ రాకెట్ దందా నడిపిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేశారు. ఈ ఊబిలో ఎంతో మంది మేకప్ ఆర్టిస్టులు, పలువురు మోడళ్లు, బాలీవుడ్ జూనియర్ యాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు.

మంగళవారం నాడు కూడా ఓ మేకప్ ఆర్టిస్టును, జూనియర్ యాక్టర్‌ను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వారిద్దరికి చెరో రూ.60వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
First published: January 16, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading