ఆఫర్ ఇస్తాను... బెడ్‌రూంకి వస్తావా... టాలీవుడ్ సింగర్‌తో ఆ డైరెక్టర్...

Casting Couch : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ జాడ్యం వదిలిపోలేదు. తాజాగా సింగర్ ప్రణవి ఉదంతమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 2:35 PM IST
ఆఫర్ ఇస్తాను... బెడ్‌రూంకి వస్తావా... టాలీవుడ్ సింగర్‌తో ఆ డైరెక్టర్...
సింగర్ ప్రణవి (Image : @Ippodhu / Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 2:35 PM IST
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్నవారికి లెక్క లేదు. ఎదో సాధిద్దామని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. తీరా చూస్తే... కొంతమంది కేటుగాళ్లు టాలీవుడ్ పెద్దల్లా చెలామణీ అవుతూ... తెరవెనక మాత్రం కీచక స్వామ్యం నడిపిస్తుంటారు. తమకు లొంగితే సరేసరి లేదంటే... రకరకాల బెదిరింపులతో ఇండస్ట్రీలోంచీ వెళ్లిపోయేలా స్కెచ్చులు వేస్తుంటారు. తమ డామినేషన్ చూపిస్తూ... మిగతా వాళ్లను తొక్కేస్తుంటారు. అలాంటి ఓ కీచకుడి వల్ల తనకు ఎదురైన అనుభవాన్ని ప్రజల ముందు ఉంచింది సింగర్ ప్రణవి ఆచార్య. చిన్నతనం నుంచే ఆమెకు సింగర్ కావాలనే కోరిక ఉండేదట. ఇంటర్ చదువుతున్నప్పుడే ఆమెకు ఓ సినిమాలో పాట పాడే ఛాన్స్ దొరికింది. ఫస్ట్ ఛాన్స్ మిస్సవ్వకూడదని అనుకుందట ప్రణవి.

పాట పాడేందుకు ఓ డైరెక్టర్ ఆమెను పిలిచాడు. ఎంతో ఉత్సాహంగా ఆయన దగ్గరకు వెళ్లింది. గొంతు సవరించుకుంది. కానీ అంతలోనే ఆమె ఆశలపై నీళ్లు చల్లాడు. మనసులో మరో ఆలోచన పెట్టుకున్న ఆ డైరెక్టర్... ఆఫర్ ఇస్తాను అంటూనే పరోక్షంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మొదలుపెట్టాడు. ఇలాంటివి జరుగుతుంటాయని ముందే తెలుసుకున్న ప్రణవి... ఆయన మాటల్లోని ద్వంద్వార్థాల్ని గ్రహించగలిగింది. కాస్త ధైర్యం తెచ్చుకొని... విషయం ఏంటో డైరెక్టుగా చెప్పమని అడిగిందట. అతను కూడా ఓపెన్ అయ్యాడు. ఆఫర్ ఇస్తాను... బెడ్ రూంకి వస్తావా అని అడిగాడట. తను ఏదైతే వినకూడదనీ, ఎలాంటి అనుభవం అయితే తనకు కలగకూడదని అనుకుందో అదే జరిగేసరికి... చాలా అప్‌సెట్ అయ్యిందట ప్రణవి.

అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్న ప్రణవి... ధైర్యం తెచ్చుకుంటూ... సర్... నేను చిన్న పిల్లని. ఇంటర్ చదువుతున్నాను. నాలాంటి అమ్మాయితో మీరు ఇలా మాట్లాడటం కరెక్టు కాదు. అని చెబుతుంటే... అదేదీ పట్టించుకోని ఆ డైరెక్టర్... డోస్ పెంచాడు. ఆమె అందచందాలపై కామెంట్లు చెయ్యడం మొదలుపెట్టాడట... అంతే ప్రణవికి ఒళ్లు మండింది. షటప్... ఇంకొక్క మాట మాట్లాడితే చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఆ డైరెక్టర్ షాకయ్యాడు.

ఆ రోజు ఆఫర్ మిస్సైనా, అది తనకు ఓ గుణపాఠంలా మారిందని తెలిపింది ప్రణవి. అప్పటి నుంచీ ఎక్కడ ఏ ఆఫర్ కోసం వెళ్లినా... కఠినంగా ప్రవర్తిస్తూ, జాగ్రత్త పడుతున్నానని తాను ఎదుర్కొన్న మీ టూ వేధింపులను మనతో చెప్పుకుంది ప్రణవి. 

ఇవి కూడా చదవండి :

రీపోలింగ్ పేరుతో చంద్రగిరి ప్రజల్ని అవమానపరుస్తున్నారు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

నేను దళిత యువతిని కాకపోయివుంటే, నన్ను రేప్ చేసేవాళ్లు కాదు : అళ్వార్ బాధితురాలు

మహిళను చంపి... ఆమె కడుపులో పిల్లాణ్ని మాయం చేశారు... ఎందుకంటే...

పవన్ కళ్యాణ్‌ తుస్సు మనిపించాడు... తమ్మారెడ్డి భరద్వాజ అలా ఎందుకన్నారంటే...
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...