హోమ్ /వార్తలు /క్రైమ్ /

పాలైనా,పెరుగైనా, పన్నీరైనా..అక్కడ ప్యూర్ కల్తీ సరుకు అమ్మబడును

పాలైనా,పెరుగైనా, పన్నీరైనా..అక్కడ ప్యూర్ కల్తీ సరుకు అమ్మబడును

Adulterated milk mafia: తెలంగాణలో కల్తీ పాల ఉత్పత్తులు మాఫియాగా మారాయి. మార్కెట్‌లో చలామణిలో ఉన్న బ్రాండ్ల పేరుతో మూతపడ్డ పరిశ్రమల్లో రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్నారు. కిరాణ షాపు యజమానులతో కుమ్మక్కై ఈ దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

ఇంకా చదవండి ...

తెలంగాణలో కొన్ని పాల ఉత్పత్తి పరిశ్రమల వ్యవహారం చూస్తుంటే తెల్లనివన్నీ పాలు కాదు అన్న మాట నిజమనే అనిపిస్తుంది. రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాలను యధేచ్చగా ప్రజలకు విక్రయిస్తున్నారు కొందరు వ్యక్తులు. గుట్టుగా సాగుతున్న మూతపడ్డ పరిశ్రమలోనే తిరిగి కల్తీ పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తూ కిరాణ షాపుల యజమానులతో చేతులు కలిపి ఈదందాను కొనసాగిస్తున్నారు. కల్తీ పాల వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం(Pashamylaram) పారిశ్రామికవాడ(Industrial area)లో ఈ కల్తీ పాల దందా బయటపడింది. మూతపడ్డ పవిత్ర డైరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Pavithra dairy products pvt ltd)లో కల్తీ పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నట్లుగా పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. ఊరు, పేరు లేని బ్రాండ్ల పేరుతో కనీసం బార్కోడ్‌ సింబల్ (Barcode symbol)లేకుండానే కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కల్తీ వ్యాపారులు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో కల్తీ పాల వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో ఊరు, పేరు లేని బ్రాండ్లతో కల్తీ రసాయనాలు కలిపి పాలు, పెరుగుతో పాటు వివిధ రకాల పాల ఉత్పత్తులు తయారు చేస్తున్న పరిశ్రమపై పటాన్ చెరు పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డితో పాటు సీఐ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

రసాయనాలతో పాల ఉత్పత్తి..

వివిధ కంపెనీల బ్రాండ్లతో రసాయనాలతో పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారని డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు. అమూల్, హెరిటేజ్, ఎన్ఎస్ఆర్, గోవర్ధన్, విశాఖ వంటి బ్రాండ్లతో పాలు, పెరుగు, పన్నీరు ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించారు. పవిత్ర డైరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టి 6 వేల లీటర్ల పాలు ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ పాల పరిశ్రమలో కెమికల్ పౌడర్ తో అనేక కంపెనీల బ్రాండ్లతో పాల ఉత్పత్తులు తయారీ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

చాటుగా సాగుతున్న కల్తీ మిల్క్ మాఫియా..

పవిత్ర మిల్క్ డైరీ మేనేజర్ ప్రసాద్ రావు, విశాఖ మిల్క్ సూపర్‌ వైజర్ పరమేశ్వర్‌ను పోలీసలు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కల్తీ పాల దందాకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి విచారణ చేపడతామని పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి వెల్లడించారు. పాశమైలారం పారిశ్రామికవాడలో ఇంకా ఎన్ని ఇలాంటి కల్తీ పాల ఉత్పత్తులు తయారు చేస్తున్న పరిశ్రమలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు పోలీసులు.

First published:

Tags: MILK, Telangana

ఉత్తమ కథలు