హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : డబుల్ బెడ్రూం ఇళ్లిప్పిస్తామని డబ్బులు వసూలు .. మోసం చేసిన వాళ్లెవరో కాదు..

Crime news : డబుల్ బెడ్రూం ఇళ్లిప్పిస్తామని డబ్బులు వసూలు .. మోసం చేసిన వాళ్లెవరో కాదు..

double bedroom houses

double bedroom houses

Crime news: మహబూబ్‌నగర్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకున్న ముఠాను అరెస్ట్ చేసి మూడ్రోజులు గడవక ముందే మరో మోసం బయటపడింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  మహబూబ్‌నగర్ (Mahabubnagar)పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకున్న ముఠాను అరెస్ట్ చేసి మూడ్రోజులు గడవక ముందే మరో మోసం బయటపడింది. డబుల్ బెడ్రూం(Double bedroom)ఇల్లు ఇప్పిస్తామని వేరువేరుగా డబ్బులు వసూలు చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు కేసులు నమోదు చేసిన వారి వద్ద నుంచి రూ 2.64 లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్(Remand)కి తరలించారు. నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నకిలీ డాక్యుమెంట్ల(Duplicate documents)ను సృష్టించిన కేసులో ఇప్పటికే ఒక బీజేపీ(BJP) మైనార్టీ(Minority) నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. ఇంకా ఈ మోసంలో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారని జిల్లా పోలీసులు(Police)ఆరా తీస్తున్నారు.

  Accident : ఆటోని ఢీకొట్టిన TS RTC ఎండీ కారు .. యాక్సిడెంట్‌లో సజ్జనార్‌తో పాటు ఐదుగురికి గాయాలు

  అమాయకులే టార్గెట్..

  మహబూబ్‌నగర్ సింహగిరి కాలనీకి చెందిన అబ్దుల్ సిరాజ్ ఖాద్రి హబీబ్‌నగర్‌కి చెందిన అజార్‌తో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని అమాయకులకు నమ్మబలికి ఏడుగుర్ని మోసం చేశారు కొందరు మోసగాళ్లు. ఏడుగురు గ్రూప్ దగ్గర నుంచి 12. 50 లక్షలు వసూలు చేసి రూ ఎనిమిది లక్షల వాడుకున్నారు. సొమ్ములిచ్చిన వారిలో భగీరథ కాలనీకి చెందిన ఆకుల కిరణ్ కుమార్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకేసులో సిరాజును అరెస్ట్ చేసి రూ.2.50. లక్షల నగదు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఖాదర్ పరాలిలో ఉన్నారు.

  డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం..

  మహబూబ్‌నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల మోసాల కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రెండు కేసులను మహబూబ్‌నగర్‌ అస్లంఖాన్ వీధికి చెందిన వనగంటి ప్రకాష్ బోయపల్లి గేటుకి చెందిన ఇర్ఫాన్‌తో కలిసి ఐదుగురి దగ్గర రెండు పడకల గదుల ఇల్లు ఇప్పిస్తామని ఐదు లక్షలు తీసుకున్నారు సుధాకర్ అనే వ్యక్తి. సెప్టెంబర్‌ 27న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రకాష్, ఇర్ఫాన్, అస్లోంకి దగ్గర తీసుకున్న 9 వేలు స్వాధీనం చేసుకున్నారు.

  Telangana : అర్జెంట్‌ కావడంతో ఆ పని మీద వెళ్లి .. తుపాకీ పోగొట్టుకున్న సైనికుడు

  మూడు కేసులు..

  ఈ మూడు కేసుల్లో ఉన్నప్పగుటకు చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని షావుద్దీన్ దగ్గర గ్రూప్ 70 వేలు కేటాయించిన ఇంటిని మార్పడానికి కలాం భాష నుంచి  రూ.30,వేలు తీసుకున్నారు. అక్షయ్ కుమార్ తండ్రి దేవేందర్ వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన కలాం పాషా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అక్షయ్ కుమార్ నుంచి రూ 5 వేల నగదు మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు  నిందితులను రిమాండ్ తరలించారు. పట్టుబడిన నలుగురిలో సిరాజ్‌ఖాద్రి, డిసిసి ప్రధాన కార్యదర్శిగా అక్షయ్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శి దేవేందర్ కుమారుడు ఉన్నారు.

  ఎవ్వర్ని వదలొద్దు..

  డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కొందరు డబ్బులు అడుగుతున్నట్లుగా బాధితులు తన దృష్టికి తేవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ చీటింగ్‌లో ఎవరి పేర్లు బయటపడినా..ఎవరి ప్రమేయం ఉన్నప్పటికి విడిచి పెట్టమని మంత్రి చెప్పారు. ఈ చీటింగ్‌లో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులను ఆయన అభినందించారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Double bedroom houses, Mahbubnagar, Telangana crime news

  ఉత్తమ కథలు