Home /News /crime /

టీడీపీ నేత నారా లోకేశ్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసిన వారిపై కేసు..

టీడీపీ నేత నారా లోకేశ్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసిన వారిపై కేసు..

నారా లోకేష్

నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ పవన్‌ను పరామర్శించేందుకు అనంతపురంలోని తాడిపత్రికి సోమవారం లోకేశ్ వచ్చారు.

  నారా లోకేశ్ అనంతపురం పర్యటన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన ఇద్దరు వ్యక్తులపై లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన మేరకు కేసు నమోదయ్యింది. వాహనాల నకిలీ పత్రాల కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ పవన్‌ను పరామర్శించేందుకు అనంతపురంలోని తాడిపత్రికి సోమవారం లోకేశ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తాడిపత్రి టౌన్ ఎస్ఐ ఖాజా హుస్సేన్ ఫిర్యాదు చేశారు. దీంతో కార్యక్రమాన్ని నిర్వహించిన సోమశేఖర్, రఘునాథ అనే ఇద్దరు వ్యక్తులపై జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద సీఐ తేజోమూర్తి కేసు నమోదు చేశారు.
  Published by:Narsimha Badhini
  First published:

  Tags: Andhra Pradesh, Crime, Nara Lokesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు