CASE REGISTERED AGAINST MUMBAI COP FOR HARASSING WOMAN POLICE OFFICER PAH
Harassing Woman Police: పోలీసు శాఖలో దుమారం.. అర్ధరాత్రి మహిళ పోలీస్ కి అసభ్య మెసెజ్ లు.. ఆ తర్వాత..
ప్రతీకాత్మక చిత్రం
Mumbai: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు కీచకుడిలా మారాడు. తోటి అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం ఈ సంఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది.
Case Registered Against Mumbai Cop: దేశంలో మహిళల పట్ల ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొంత మంది కీచకులలో మార్పులు రావడం లేదు. మహిళ కనిపించగానే కామంతో రెచ్చిపోతున్నారు. పసి బాలిక నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. అందరి మీద తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. కొంత మంది మహిళల, యువతుల సెల్ నంబర్లను సేకరించి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
అశ్లీల వీడియోలు, అసభ్య మెసెజ్ లు పంపుతూ వారిని లైంగికంగా వేధిస్తున్నారు. దాదాపు.. ప్రతి ఒక చోట మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తుంటే.. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు కీచకులుగా మారుతున్నారు. కొన్ని చోట్ల కన్న బిడ్డలపై కూడా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా పశువులపై కూడా అత్యాచారానికి తెగబడుతున్నారు.
ఆవు, మేక,కుక్క.. మరీ దారుణంగా ఈ మధ్య కొందరు ఉడుముపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక కొన్ని చోట్ల ఇలాంటి వారిని శికించాల్సిన పోలీసులు కూడా పలువురు మహిళను (Woman Facing Harassing) వేధించిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఫిర్యాదు కోసం వచ్చిన వారిపై, తమ అధికారం అడ్డంపెట్టుకుని మరికొందరిని వేధించారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర దుమారం రేపింది.
పూర్తి వివరాలు.. ముంబైలోకి (Mumbai) ఖర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న పోలీసు కానిస్టేబుల్ తన పై అధికారిణిని కొన్ని రోజులుగా అసభ్యమెసెజ్ లు పంపుతున్నాడు. కొన్ని రోజుల ఆమె.. దీన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత.. వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈనెల ఏప్రిల్ 8 న కూడా అర్దరాత్రి అసభ్య మెసెజ్ లు పంపించాడు.
ఆ తర్వాత.. తనతో కోరిక తీర్చాలంటూ వాట్సాప్ సందేశాలు చేశాడు. ఇతగాడి తీరుకు విసిగిపోయిన సదరు అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు (Enquiry on crime) పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనతో అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజలను కాపాడాల్సిన అధికారులు దారితప్పడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. నిందితుని కాల్ డేటా సేకరించే పనిలో అధికారులు పడ్డారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.