ఎయిర్‌హోస్టెస్‌ చేతులు తడుముతూ వెధవ్వేషాలు... బుక్కైన హైదరాబాద్ వ్యాపారి

Indio Air Lines : ఎయిర్‌హోస్టెస్ అంటే చాలు చాలా మంది అతిగా ఊహించేసుకుంటారు. ఆ తర్వాత చిక్కుల్లో పడతారు. ఆ వ్యాపారి ఏం చేశాడో తెలుసా...

Krishna Kumar N | news18-telugu
Updated: May 3, 2019, 10:58 AM IST
ఎయిర్‌హోస్టెస్‌ చేతులు తడుముతూ వెధవ్వేషాలు... బుక్కైన హైదరాబాద్ వ్యాపారి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అసలే ఫొణి తుఫాను ప్రభావంతో ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ తమ విమాన సర్వీసులను రద్దు చేసుకుంటూ... నానా హడావుడిలో ఉన్నాయి. దేశీయంగా ఎక్కువ విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా... ప్రయాణికుల్ని ఎలా తరలించాలన్న అంశంపై బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో... హైదరాబాద్‌కి చెందిన ఆ వ్యాపారి చేసిన నిర్వాకం తెరపైకి వచ్చింది. విమానంలో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు RGIA పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. అసలేం జరిగిందంటే... విశాఖపట్నానికి చెందిన ఆ అమ్మాయి (19) ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది. ఈమధ్యే విధుల్లో చేరి... ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటోంది.

మే 1న ముంబై నుంచీ హైదరాబాద్‌కి బయలుదేరింది ఓ ఇండిగో విమానం. ప్రయాణికులతో నిండివున్న ఆ విమానంలో... ఆ యువతి విధులు నిర్వర్తిస్తోంది. అదే విమానంలో ప్రయాణస్తున్నాడు హైదరాబాద్... మల్కాజ్‌గిరికి చెందిన బిజినెస్ మేన్ శ్రీనివాసరావు. అందంగా ఉందనుకున్నాడో, లేక ఆమె అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడో గానీ... 40 ఏళ్ల శ్రీనివాసరావు... ఆమెను దగ్గరకు పిలిచాడు. వాట్ యూ వాంట్ సార్ అని ఎంతో మర్యాదగా అడిగింది. వెంటనే ఆమె రెండు చేతులూ పట్టుకొని... ఐ వాంట్ యూ అంటూ ఏదేదో వాగాడు. పైగా మద్యం మత్తులో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చాడు.

సార్ దిసీజ్ నాట్ ఫెయిర్ అంటూ ఆమె ఎంతగానో బతిమలాడింది. వినిపించుకుంటేగా... అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. ఎలాగొలా అక్కడి నుంచీ తప్పించుకున్న ఆమె... విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యేంతవరకూ... భయం భయంగా గడిపింది. ఓ వ్యాపార వేత్త అయివుండీ, జెంటిల్మేన్‌లా కనిపిస్తూ... అసభ్యంగా ప్రవర్తించడంతో తన సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదామెకు. విమానం దిగే సమయంలోనూ వేధించడంతో... శంషాబాద్‌లో పోలీసులకు కంప్లైంట్ చేసింది ఆ ఎయిర్ హోస్టెస్ట్. కేసు నమోదు చేసిన పోలీసులు... ఎంక్వైరీ చేస్తామంటున్నారు.

 ఇవి కూడా చదవండి :

Cyclone Fani : రేపు సాయంత్రం వరకూ ఫొణి తుఫాను ప్రభావం... నాగాలాండ్, మణిపూర్‌కీ పొంచివున్న ముప్పు...

Cyclone Fani : పూరీపై విరుచుకుపడిన ఫొణి తుఫాను... సహాయక చర్యల్లో NDRF...

సీసీ కెమెరాను కొట్టేసి... మరో సీసీ కెమెరాకు దొరికిన దొంగ...

తమిళనాడులో వింత దూడ... మనిషిలా ప్రవర్తిస్తూ... ఆందర్నీ ఆశ్చర్యపరుస్తూ...
First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు